నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

Sun,July 14, 2019 01:00 AM

గద్వాల, నమస్తే తెలంగాణ: కేసీఆర్ స్ఫూర్తితో గద్వాల అభివృద్ధే ధ్యేయంగా తాను ప్రజలకు సేవ చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉండడంతోనే రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యారని స్పష్టం చేశారు. అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక శాఖ ఉండాలని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కార్మికులకు హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో హమాళీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికుల జీవన పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని, ఆ స్థితి నుంచి వారిని బయట వేసే మార్గం ఆలోచిస్తానన్నారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారికి ఫుట్‌పాత్ స్థలాన్ని ఏర్పాటుచేసి వారికి శాశ్వత జీవనోపాధి కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ట్రాక్టర్, ఆటోలకు టాక్స్ లేకుండా చేశారన్నారు. నియోజకవర్గంలో మూడు సంవత్సరాల్లో 10వేల మంది మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళిక రూ పొందిస్తామని, అందులో భాగంగా వారికి కుటీర పరిశ్రలు ఏర్పాటుచేసి అందులో స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కల్పిస్తామన్నారు.

మహిళలు ఆత్మ గౌరవంగా జీవించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మాడ్రన్ కూరగాయ ల మార్కెట్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఒకే దగ్గర కూరగాయలతో పాటు మాంసాహారం, సూపర్ మా ర్కెట్ ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నా రు. రైతులకు చేయూత నిచ్చి వ్యవసాయ రంగానికి తెలంగాణలో సీఎం పెద్దపీట వేశారని తెలిపారు. అనంతరం కార్మికులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిని సన్మానించారు. సమావేశంలో జోగులాంబ గద్వాల జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కిషన్‌రావు, మాజీ జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎంపీపీ రాజారెడ్డి, నేతలు రమేష్‌నాయుడు, సలాం, యూసుఫ్, కార్మికసంఘం నాయకుడు బాలగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles