సర్వం సిద్ధం

Sun,July 14, 2019 01:01 AM

గద్వాలటౌన్: ప్రభుత్వం మొదట తీసుకున్న నిర్ణయం మేరకు మున్సిపా లిటిల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. అలాగే వా ర్డుల విభజనపై, ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలను స్వీకరించారు. వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించ నున్నారు. అలాగే జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ స్టేషన్లను అధికారులు పరిశీలించారు. పోలింగ్‌కు అనువైన కేంద్రా లను ఎంపిక చేశారు. సోమవారం కేంద్రాలపై అభ్యంతరాలను తీసుకుంటా రు.

పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోను పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్త య్యిం ది. గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలోని వార్డుల ఓటర్ల సంఖ్య అధారంగా కేంద్రాలను గుర్తించారు. 800 మంది ఓటర్లకు ఒక్కొ కేంద్రం చొప్పున ప్రతి వార్డుకు రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. గద్వాల,అయిజలో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుర్తించిన కేంద్రాలపై మార్పులు, చేర్పులు చేసేందు కు అవకాశం కల్పించారు. అందు కు గా ను సోమవారం నుంచి అభ్యంతరాలను తీసుకోనున్నారు. అభ్యంత రాలను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాను 19వతేది జిల్లా ఎన్నికల అధికారికి జాబితాను అందచేస్తారు.

పోలింగ్ కేంద్రాలు ఇలా...
జిల్లాలోని పెద్ద మున్సిపాలిటీ అయిన గద్వాల మున్సిపాలిటీని 37వార్డులుగా విభజించారు. 37వార్డులకు గాను 80పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించి ఎంపిక చేశారు. అలాగే అయిజ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 34 కేంద్రాలను పరిశీలించి ఎంపిక చేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటిలో 20 కేంద్రాలకు, అలంపూర్ మున్సిపాలిటిలో 20 కేంద్రాలను పరిశీలించి ఎంపిక చేశారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ...
మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కింపు గణన పూర్తయ్యి ఈ నెల 14న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో వార్డులు, మున్సిపల్ చైర్మన్‌ల రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయో అన్న ఉత్కంఠ అన్ని రాజకీయ పక్షాల నాయకుల్లో నెలకొంది. ఏఏ వార్డుల ఏ రిజర్వేషన్ కిందకు వచ్చిందోనని తెలుసుకోవడానికి ప్రతి రోజు అశావహులు కార్యాలయం చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా లేని చోట తమ కుటుంబ సభ్యు లను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నారు. సామాజిక సమీక రణను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు విందు రాజ కీయాలకు తెర లెపడంతో రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది.

కాసింత రిలాక్స్..
మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు, ఆశావహులు ఉరుకుల పరుగుల మీద అన్ని పనులు చక చక కానిస్తున్నారు. సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ నూ తన చట్టాన్ని తీసుకొచ్చిన తరువాతే ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో అంద రూ కూడా కాసింత రిలాక్స్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా విధులు నిర్వహించిన అధికారు లు కాసింత ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ నెల అఖరిలోపు నోటిఫికేషన్ విడుదల అయితే వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles