మొక్కల పెంపకానికి రైతులను గుర్తించాలి

Sun,July 14, 2019 12:48 AM

సదాశివనగర్: మండలంలోని కుప్రియాల్ గ్రామంలో శనివారం ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆగ్రోఫారెస్ట్రీ (శ్రీ గంధం, వెదురు, సరుగుడు, టేకు, మొక్కల పెంపకం)పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యనారాయణ, ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట ఉద్యాన వన శాఖ డైరెక్టర్ వెంకటరాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అగ్రోఫారెస్ట్రీ ద్వారా జిల్లా ఉద్యానవన, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్రీ గంధం, సరుగుడు, వెదురు, టేకు మొక్కల పెంపకానికి రైతులను గుర్తించి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. శ్రీ గంధం 20 లక్షలు, వెదురు 10 లక్షలు, టేకు 12 కోట్లు (ఇందులో రెండు కోట్లు అటవీశాఖ, 10 కోట్లు ఉపాధిహామీ పథకం ద్వారా) నాటాలన్నారు. రైతులను గుర్తించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ప్రోత్సహకాలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా భూంరెడ్డి ఇతర రైతులు మొక్కలు నాటడానికి ముందుకు వచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి శేఖర్, ఏనుగు మంజుల, ఎంపీటీసీ ఏలేటి స్వరూప భూంరెడ్డి, నరేందర్ రావు, అరిగె సాయిలు మాజీ వైస్ ఎంపీపీ రూపేందర్ పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles