ప్రజల కోసం పనిచేసేదే నిజమైన ప్రభుత్వం

Sun,July 14, 2019 12:48 AM

ఎల్లారెడ్డి రూరల్ : ప్రజల కోసం పనిచేసేదే నిజమైన ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన నాయకులని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆయన శనివారం ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ. 1.85 కోట్లతో జంక్షన్ అభివృధ్ధి పనులు, రోడ్డు డివైడర్ పనులు, నయాబాదిలో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 85 లక్షలతో చిల్డ్రన్స్‌పార్క్ పనులు, పట్టణంలోని గాంధీచౌక్ నుంచి సోమార్‌పేట్ రోడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలాకాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు తప్ప మిగతా ఎన్నికలు పూర్తయ్యాయని, అధికారులుగానీ, నాయకులు పరిపాలన పై, ప్రజలు, వారి అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ తదితర కార్యక్రమాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆంధ్రపదేశ్ సీఎం జగన్ మన పథకాలను ఆదర్శంగా తీసుకొని అక్కడ ప్రవేశపెట్టారన్నారు. 58 లక్షల మందికి రైతు బంధు ద్వారా చెక్కులు అందజేస్తున్నామన్నారు. పార్ట్- బీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌కు స్థానిక గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పెద్ద మసీదు నుంచి కోలాటాలతో స్వాగతం పలికారు. గౌడ్స్‌గల్లీ, రిక్షాకాలనీ, పన్నాలాల్ కాలనీల్లో అభివృద్ధి పనులకు సబంధించిన శిలాఫలకాలను ఎమ్మెల్యే సురేందర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుతానని, తనను గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి ఒక్కొక్కటి పూర్తిచేస్తామన్నారు రోడ్లు, విద్యుద్దీపాలు, మురికి కాలువల సమస్య పరిష్కరించి ఎల్లారెడ్డిని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్ గౌడ్, నాయకులు కుడుముల సత్యం, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నునుగొండ శ్రీనివాస్, ప్యాలాల రాములు, నామ శ్రీనివాస్, చెన్న సతీశ్, తానాజీరావు, ఫసీ, రాజేశ్వర్, నరహరి, ఇమ్రాన్, ముజీబ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles