విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

Mon,July 15, 2019 01:21 AM

రుద్రూర్‌ : మండలకేంద్రంలోని శశిరేఖ గార్డెన్‌లో 1987-88 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒకరి కొకరు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ.. 1987-88లో పదోతరగతి పూర్తి చేసిన తమ తోటి విద్యార్థిని వి ద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ని పనులున్నా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన వారు తరగతి గదుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, మంచీచెడులను పంచుకొన్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో ఏండ్లు కలిసి చదువుకొని దూరమైన స్నేహితులు మళ్లీ ఇలా కలుసుకోవడం మధురానుభూతిని మిగిలిస్తుందని వారన్నారు. కార్యక్రమంలో నరేందర్‌, భాస్కర్‌, సుధాకర్‌గౌడ్‌, శ్రీను, శంశీర్‌, రమేశ్‌తో పాటు 25 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles