తుది జాబితాకు కసరత్తు..

Mon,July 15, 2019 01:22 AM

కామారెడ్డి నమస్తేతెలంగాణ : కామారెడ్డి మున్సిపల్‌లో ఓటరు జాబితాలో గందరగోళంపై కలెక్టర్‌ సత్యనారాయణ సీరియస్‌ అయ్యారు. దీంట్లో భాగంగా శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ను మున్సిపల్‌ శాఖకు సరెండర్‌ చేయడంతో కలెక్టర్‌ ఎన్నికల ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. కామారెడ్డి డిప్యూటీ జడ్పీ సీఈవో చందర్‌నాయక్‌కు ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌గా శనివారం రాత్రి బాధ్యతలు అప్పగించారు. అనంతరం మున్సిపల్‌ ఓటరు జాబితాపై ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఇన్‌చార్జి డీపీవో సాయన్నతో పాటు 49 వార్డులకు ప్రతి పది వార్డులకు సూపర్‌వైజర్‌లను కలెక్టర్‌ నియమించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన కమిషనర్‌ చందర్‌నాయక్‌ ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని, దీన్ని సరిదిద్దడానికే కలెక్టర్‌ ప్రత్యేకంగా సూపర్‌వైజర్‌లను నియమించారని ఇన్‌చార్జి కమిషనర్‌ చందర్‌నాయక్‌ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 49 వా ర్డుల్లో ఓటరు జాబితాపై గల సందేహాలను నివృత్తి చేయడానికి అధికారులు అంతా సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓటరు తుది జాబితా కోసం సూపర్‌వైజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నెల 10న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలో ఓటరు ముసాయిదా విడుదల చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం ఈ నెల 14వ తేదీ వరకు కూడా తుది జాబితా విడుదల కాలేదు. దీంతో కలెక్టర్‌ ప్రత్యేక అధికారులను నియమించి మున్సిపల్‌ ఓటరు జాబితాపై దృష్టి సారించారు. అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు తుది జాబితాను ఈ నెల 16న విడుదల చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అలాగే ఈ నెల 15న పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించాల్సి ఉండగా దీనిని సైతం వాయిదా వేసి ఈ నెల 17న పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించనున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు తుది జాబితాను ఈ నెల 16 న విడుదల చేయన్నారు. అలాగే ఈ నెల 15న పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించాల్సి ఉండగా 17కు వాయిదా వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకుల్లో నెలకొన్న సందేహాలను, ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా మున్సిపల్‌ తుది జాబితాను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్ర సమాచారంతో ఓటరు తుది జాబితాను విడుదల చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. మూడు రోజులుగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో ధర్నాలు, ఆందోళనలు జరగుడంతో కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం హుటాహుటిన మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌పై వేటు వేయడంతో పాటు నోడల్‌ అధికారిగా ఇన్‌చార్జి డీపీవో సాయన్నతో పాటు మున్సిపల్‌కు సంబంధంలేని కామారెడ్డి ఎంపీడీవోలను, ఆర్డీవోలను ఇతర అధికారులను ప్రత్యేకంగా నియమించారు. కామారెడ్డి మున్సిపల్‌ ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరకుండా పారదర్శకంగా ఉండేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

రాజకీయ పార్టీలకు చెక్‌
కామారెడ్డి మున్సిపాలిటీలో కొంత కాలంగా వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న ఆందోళనకు ధర్నాలకు కలెక్టర్‌ తనదైన శైలిలో చెక్‌ పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా మున్సిపల్‌ కమిషనర్‌పై వేటు వేయడంతో పాటు వెనువెంటనే ప్రత్యేకంగా నోడల్‌అధికారితో పాటు సాయన్నతో పాటు కామారెడ్డి జడ్పీ డిప్యూటీ సీఈవో చందర్‌నాయక్‌కు కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రలకు కలెక్టర్‌ చెక్‌ పెట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నిర్ణయాలు ఉంటాయని రుజువు చేశారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles