బాలల హక్కుల రక్షణకు పాటుపడాలి

Wed,April 17, 2019 01:01 AM

ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్16: ఖమ్మం జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతీ ఒక్కరు పాటు పడాలని జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధుల, వికలాంగల సంక్షేమశాఖ అధికారి రాయపుడి వరలక్ష్మి తెలిపారు. నగరంలోని టీటీడీసీ సమావేశమందిరంలో ఆయా గ్రామాల సర్పంచులకు, ఎస్‌ఎంఎస్ చైర్మన్లు, బాలల రక్షణ కమిటీ సభ్యులకు మంగళవారం నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ కోసం ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాటు పడాలన్నారు. బాల్యవివాహాల, బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. బాలికల అక్రమరవాణ పట్ల అప్రమత్తంగా ఉండి బాలికలకు మంచి భవిష్యత్ ఉండే విధంగా తమ వంతు సహకారం అందించాలన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బాల్య వివాహాల, బాలకార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. అయితే పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా బాలల రక్షణ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి టీ విష్ణువందన, చైల్డ్ వెల్పేర్ కమిటీ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

289
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles