విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

Wed,April 17, 2019 01:02 AM

-శిక్షణలో జడ్పీసీఈవో ప్రియాంక
బోనకల్లు:జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పోలింగ్ అధికారులు సమర్థ వంతంగా నిర్వహించాలని జడ్పీసీఈవో ప్రియాంక సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా శిక్షణ అధికారి శైలేంద్ర పలు సూచనలు, సలహాలను శిక్షణలో వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జడ్పీసీఈవో ప్రియాంక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణలో తెలుసుకున్న విషయాలను ఆమె ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటు వేసేం దుకు వచ్చిన ఓటరుకు తప్పనిసరిగా సీరాను వేళ్లకు వేయాలని, అదేవిధంగా బ్యాలెట్ పత్రాలను నిలువుగా మలిచి తర్వాత అడ్డంగా మలిచే విధంగా ప్రతి పీవో అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. ఛాలెంజ్ ఓట్లు, టెండర్ ఓట్లు ఏ విధంగా ఇవ్వాలనే విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ పూర్తయిన తర్వాత పూర్తిచేయాల్సిన ఫారాలను తప్పొప్పులుగా నింపుతు న్నారని, మళ్లీ వాటిని సరిచేయడం కోసం మరోసారి ప్రయత్నించకుండా సక్రమంగా పూర్తిగా చదివి వాటిని నింపాలన్నారు. పీవోలు, ఏపీవోలు, ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లతో ముందస్తుగా ఎన్నికల నిబంధనలు వివరించి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ.శ్రీదేవి, ఈవోఆర్డీ గీతాశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

267
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles