స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలి

Wed,April 17, 2019 01:02 AM

-వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
వైరా, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరా నియోజకవర్గంలో మూడు విడతల్లో ఐదు జెడ్పీటీసీలకు, 61 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో గెలుపే ధ్యేయంగా నాయకులు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

వైరా మండలంలో ఒక జెడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాలకు, కొణిజర్ల మండలంలో 15 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, ఏన్కూరు మండలంలో 10 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, సింగరేణి మండలంలో 16 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, జూలురుపాడు మండలంలో 10 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు ప్రణాళికా ప్రకారంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.ఆసరా పెన్షన్‌లు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వర్తింపజేసిందన్నారు.

265
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles