ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర

Wed,April 17, 2019 11:50 PM

ఖమ్మం నమస్తే తెలంగాణ : నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు రిటర్నింగ్ అధికారులు తమ విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వీ.కర్ణన్ అన్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేటాయించబడిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు టీటీడీసీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర అని ఎన్నికల నిబంధనలు పూర్తిగా అవగాహన చేసుకొని ఎటువంటి లోటు పాట్లు జరుగకుండా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కూడా సమాన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని తమ విధులను, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, నోడల్ అధికారి కె.శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, మాస్టర్ ట్రైనర్స్ శైలేందర్, సత్యనారాయణ,నాగిరెడ్డి, శేషగిరి శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.

252
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles