పండ్లతో ఆరోగ్యం మెండు..

Wed,April 17, 2019 11:51 PM

టేకులపల్లి : వేసవి సీజన్‌లో ఎండ వేడిమి తట్టుకోలేక పండ్లు, పండ్ల రసాలు వేవిస్తుంటాం.. మనం రోజువారిగా తీసుకునే పలు రకాల పండ్ల రసాల్లో మన శరీరానికి ఉపయోగం పడతాయి. మన శరీరాన్ని ఎలా కాపడతాయో తెలుసుకుందాం.. మార్కెట్‌లో కర్బూజా, సపోటా, బత్తాయి, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరిబొండాలు వేసవి కాలంలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా ప్రముఖ పాత్ర పోషిస్తూ దేహం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతాయి. అందుకే ఇంట్లో మనం తీసుకునే పండ్ల రసాలను ఎలా తయారు చేసుకోవాలి.. ఏవిధంగా నిల్వ చేసుకోవాలో తెలుసుకుందాం..

నిమ్మరసం..
లీటర్ నిమ్మరసం తయారు చేయాలంటే యాభై నుంచి అరవై నిమ్మకాయల రసాన్ని పిండి వడక పట్టాలి. పంచదార కలిపి పక్కన పెట్టాలి. రసం కొలతను అంచానా వేసి అంతే పరిమాణంలో నీళ్లను ఓ గిన్నెలో వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగేటప్పుడు రెండు కిలోల పంచదార, అరటీకప్పు నిమ్మరసం వేసిపాకంగా మారాక పలుచటి గుడ్డలో వడకట్టాలి. చల్లారిన తర్వాత మిగతా నిమ్మరం కలిపాలి. ఈ మిశ్రమం చెడిపోకుండా కొద్దిగా పోటాషియం బైసల్పేట్‌ను ఉపయోగించాలి. గ్లాస్ నిమ్మరసానికి రెండున్నర నుంచి మూడు గ్లాసుల వరకు నీటిని కలిపి తాగవచ్చు.

ద్రాక్షరసం..
కేజీ ద్రాక్ష పండ్లను తీసుకుని బాగా కడిగి కాడలను తొలగించి మెత్తగా తయారు చేసుకోవాలి. నీళ్లు కలపకుండా పదినిమిషాలు ఉడికించాలి. తరువాత రసాన్ని తీయాలి. ఈ రసాన్ని కొలిచి ఒక పక్కన ఉంచాలి. కొంచెం పంచదార వేయాలి. ద్రాక్షరసం పరిమాణానికి సమాన పరిమాణంలో నీటిని తీసుకుని పొయ్యిపై ఉంచాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రెండు కేజీల పంచదార వేసి పూర్తిగా మరిగిన అనంతరం 25గ్రాముల నిమ్మ ఉప్పును దానికి జోడించి బాగా కలపాలి. కొన్ని రోజుల నిల్వ చేసుకోవచ్చు.

మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్..
భిన్న రకాల పండ్లను కడిగి అవసరమైన వాటికి తొక్కలు తీసేసి తర్వాత గింజలు తొలగించాలి. వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసి తగినంత నీటిని పోసి ముక్కలు మొత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ముక్కలను మిక్సిలో వేసి రసం తీయాలి. సరిగ్గా అంతే పరిమాణంలో పంచదార వేసి ఉడికించాలి. గిన్నె అడుగుభాగం నుంచి చిన్న బుడగలు వచ్చిన తరువాత ఒక కప్పు నిమ్మ ఉప్పు కలిపి మరో పదినిమిషాలు వేడిచేస్తే జామ్ తయారవుతంది.

ఇదే ఆరోగ్యం :
శరీరంలో నీటిశాతం తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. వేసవికాలంలో అధికంగా నీరు, పండ్లు, ఇంట్లో ఐస్ వేయకుండా స్వతహగా తయారు చేసుకునే పండ్లరసాలు తీసుకోవడం వలన డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ప్రతి మనిషి రోజుకు నాలుగులీటర్ల నీటిని తీసుకోవాలి. పండ్ల రసాల కంటే పండ్లను నేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఏలాంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తవు.
-కంచర్ల రాజశేఖర్, వైద్యాధికారి, సులానగర్ పీహెచ్‌సీ

416
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles