రూ.19లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

Fri,April 19, 2019 03:07 AM

- ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
పాల్వంచ, ఏప్రిల్ 18 : భద్రాచలం నుంచి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాల్వంచ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కారులో ఉన్న రూ.19.5లక్షల ఖరీదు చేసే 1.50 కింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు వివరాలను వెల్లడించారు. పాల్వంచలోని బస్టాండు ఎదురుగా పాల్వంచ సీఐ మడత రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బూర్గంపాడు మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన దుగ్గెంపుడి శివశంకర్ రెడ్డి కారు డ్రైవర్ అదే గ్రామానికి చెదిన మహ్మద్ షేర్‌ఖాన్‌తో కలిసి టీఎస్ 12ఈసి 5956 అనే నెంబర్ కలిగిన ఇండిగో కారులో గంజాయిని ప్యాక్ చేసి 5కేజీల ప్యాకెట్స్ 30 గంజాయి ప్యాకెట్లను కారు డిక్కీలో వేసుకుని మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు బయలుదేరి పోతున్నారు. ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రంకు చెందిన బిస్వాన్, శ్యామర్ అనే వ్యక్తులతో ఒరిస్సా నుంచి భద్రాచలంకు తెప్పించుకుని నారాయణ ఖేడ్‌కు పోతున్నారు. ఈ క్రమంలో పాల్వంచలో జరుపుతున్న వాహన తనిఖీలో గంజాయి పట్టుబడింది. ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి గతంలో ఆఫ్రికా ఖండంలోని కెన్యా, సుడాన్ దేశంలో పనిచేసి వచ్చాడు. అత్యంత విలాసమైన జీవితానికి అలవాటు పడ్డ సదరు వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఒరిస్సా నుంచి భద్రాచలంకు గంజాయిని తెప్పించి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలోని పిట్లం గ్రామానికి చెందిన దర్మారెడ్డి, జయపాల్ రెడ్డిలకు అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్ గౌడ్, ఎస్సై ముత్యం రమేష్‌లు పాల్గొన్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles