జూదానికి పాల్పడితే చర్యలు

Sat,April 20, 2019 11:57 PM

కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 20 : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల ముసుగులో జూదాలు నిర్వహిస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ ఎస్.ఎం. అలీ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు జూదరులను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అలీ వెల్లడించారు. పట్టణంలోని రామవరం కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు టూ టౌన్ పోలీసులకు సమాచారం తెలిసిందని తెలిపారు. ఈ మేరకు ఎస్సై కుమార స్వామి ఆధ్వర్యంలో సిబ్బంది ఎస్సీబీ నగర్‌లో దాడులు న్విహించి ముగ్గురు ఐపీఎల్ జూదరులను అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టణంలోని రామవరం ఎస్సీబీ నగర్‌కు చెందిన కడారి వేణుగోపాల్, శ్రీరాముల విశ్వనాధ్, నెహ్రుబస్తీకి చెందిన దేవేందర్ సింగ్‌లు క్రిక్‌బజ్ యాప్ ద్వారా ఈ జూదాన్ని నిర్వహిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరిపై విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఉంచి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

క్రిక్‌బజ్ యాప్ ద్వారా సదరు వ్యక్తులు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గరు వ్యక్తుల వద్ద నుంచి రూ.24వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జూదానికి బానిసలై తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటూ కొందరు యువకులు తప్పుదోవ పడుతున్నారని, ఇలాంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోకూడదని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. ఐపీఎల్ జూదంపై ప్రత్యేకమైన నిఘా బృందాలను ఏర్పాటు చేశామని, జూదరుల కదలికలను ఎప్పటికప్పుడు ఈ బృందాలు మానిటరింగ్ చేస్తూనే ఉంటాయని, ఎవరైనా జూదం నిర్వహిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి విషయాలకు వినియోగించాలని, ఇటువంటి జూదాల కోసం వాటిని వినియోగిస్తే కటకటాలపాలు కాక తప్పదని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి, ఎస్సైలు కుమారస్వామి, అమీర్‌జాని, పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్, పీఎస్ సిబ్బంది భీముడు, చన్నికోటి, రాంబాబు, మోహన్ బాబు, రాందాస్‌లు పాల్గొన్నారు.

399
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles