పరిషత్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలి..

Mon,April 22, 2019 01:23 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: కొద్దిరోజుల్లో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదిర్శి, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి పలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడత మే 6వ తేదీన ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో రెండవసారి కూడా అధికారాన్ని కట్టబెట్టారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. శాసనసభ ఎన్నికల్లో, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల నుంచి పోటీచేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఖమ్మం జిల్లాలో జరిగే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకునే విధంగా పనిచేయాలన్నారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆరేనన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుతో జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మే నెల నుంచి ఆసరా పింఛన్‌లు రెట్టింపు అవుతున్నాయని, సీఎం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు తీసుకువెళ్లాలని కోరారు.

పాలేరులో టీఆర్‌ఎస్‌దే విజయం..
దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నివర్గాల ప్రజల్లో పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాయని పాలేరు నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ శ్రావణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ప్రతి ఓటరుకు అర్థం అయ్యే విధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీశ్రేణులు పనిచేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అన్నిరకాల సంక్షేమ పథకాలలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలో మన రాష్ట్రం అన్నిరంగాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉందన్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, అదేవిధంగా మే 6న జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, సాదు రమేష్‌రెడ్డి, బెల్లం వేణుగోపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ జడ్పీటీసీ బాలక్రిష్ణరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక..
కూసుమంచి మండల మాజీ జడ్పీటీసీ రామసహాయం బాలక్రిష్ణరెడ్డితో పాటు మరికొందరు నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్ కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బాలక్రిష్ణరెడ్డికి రాష్ట్ర కార్యదిర్శి తాతా మధు నాలుగు మండలాల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాలక్రిష్ణరెడ్డితో పాటు నాయకులు రాజుపీట సర్పంచ్ వాసంశెట్టి అరుణ, పెరికసింగారం మాజీ సర్పంచ్ వేముల వీరయ్య, జుజ్జులారావుపేట మాజీ సర్పంచ్ పడిశాల గోపితో పాటు మరికొందరు పార్టీలో చేరుతున్నట్టుల తెలిపారు.

538
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles