కేటీపీఎస్ ఏడో దశలో తిరిగి ఉత్పత్తి ప్రారంభం

Mon,April 22, 2019 11:33 PM

పాల్వంచ,ఏప్రిల్22: కేటీపీఎస్ ఏడో దశ 12వ యూనిట్‌లో సోమవారం నుంచి పూర్తిస్థాయి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తిరిగి చేపట్టారు. ఈనెల 17వ తేదీన యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్స్ లీకేజీ జరిగి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి బాయిలర్ ట్యూబ్స్ లీకేజిలతో పాటుగా మిగిలిన బాగాల్లోని మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 9గంటలకు యూనిట్‌ను ఆయిల్‌తో బాయిలర్‌ను మండించి లైటప్ చేశారు. అనంతరం ఆర్ధరాత్రి నుంచి యూనిట్‌లో తిరిగి విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. అంచెలంచెలుగా యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటూ తిరిగి సోమవారం తెల్లవారుజామున 2గంటలకు పూర్తిస్థాయి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి తెలంగాణ రాష్ట్ర గ్రిడ్‌కు అనుసందానం చేశారు. దీంతో అధికారులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌కు అత్యంత డిమాండ్ ఉన్న సమయంలో ఏడో దశలో తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో రాష్ట్ర గ్రిడ్‌కు అదనపు భారం తప్పింది. యూనిట్ అప్పటి నుంచి నిరంతరాయంగా ఎలాంటి ఒడదొడుకులు లేకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నని ఏడో దశ ఎస్‌ఈ ఎం. శ్రీనివాసరావు నమస్తేకు తెలిపారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles