తొలిరోజు మందకొడిగా..

Mon,April 22, 2019 11:34 PM

- జడ్పీటీసీకి-3, ఎంపీటీసీలకు
-12 నామినేషన్లు దాఖలు

మామిళ్లగూడెం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో భాగంగా సోమవారం మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికల్లో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి ఏడు మండలాల్లో అధికారులు నామినేషన్లకు ఏర్పాట్లు చేశారు. తొలి విడత ఎన్నికలకు మొదటి రోజు నామినేషన్ల దాఖాలుకు అభ్యర్థులు ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల పరిధిలో ఏడు జడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు మాత్రమే అభ్యర్థులు అధికారులకు అందించారు. అలాగే ఏడు మండలాల్లో ఉన్న 112 ఎంపీటీసీలకు కేవలం 12 నామినేషన్లు మాత్రమే అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలు అధికారులకు అందించారు. జిల్లా పరిషత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏడు మండలాల్లో కామేపల్లి-1, కూసుమంచి-1, ముదిగొండ-4, సింగరేణి-3, తిరుమలాయపాలెం-3 మాత్రమే నామినేషన్లు వచ్చాయని తెలిపారు. వాటిలో టీఆర్‌ఎస్-5, కాంగ్రేసు-5, స్వంతత్రులు-2 నుంచి నామినేషన్ పత్రాలు అధికారులకు అందించారు. అలాగే ఏడు జడ్పీటీసీ స్థానాల్లో కామేపల్లి-1, సింగరేణి-1, తిరుమలాయపాలెం-1 నామినేషన్లు వచ్చాయి. వాటిలో కాంగ్రెస్-1, స్వంతత్రులు-2 నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ పత్రాలు దాఖాలుకు మరో రెండు రోజులు గడువు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అన్ని ప్రధాన పార్టీలు బుధవారం ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

287
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles