జడ్పీపీఠంపై గులాబీ గురి..!

Mon,April 22, 2019 11:35 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ పార్టీ విజయదుంధుబి మోగిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కడుతూనే ఉన్నారు. దీంతో విపక్ష పార్టీలు విలవిలలాడుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే తప్ప గెలుస్తామనే ధీమా మాత్రం వారిలో కనిపించడంలేదు. ప్రతి పక్ష పార్టీల నాయకుల తీరుకు విసుగెత్తిన ఆయా పార్టీల ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు రానప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి. టీఆర్‌ఎస్ యేతర పార్టీల నుంచి గెలుపొందిన శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. రానున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో విజయకేతనం మోగించేలా ప్రణాళికను రూపొం దించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైద్రాబాద్‌లో పార్టీ శ్రేణులతో నిర్వ హించిన సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం ఆదేశాలతో కార్యచరణను ప్రారంభించారు.

ఖమ్మం జడ్పీ పీఠం కైవసం దిశగా...
ఖమ్మం జిల్లా జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్ వ్యూహం రచిస్తుంది. ఖమ్మం జిల్లాలోని 20 మండలాలో గులాబీ పార్టీ అతిపెద్ద పార్టీగా విస్తరించి ఉంది. అధికార పార్టీ వ్యూహం ముందు ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు లేని స్థితి ఉంది. అధికార పార్టీని ఎదురుకోలేక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏకమవుతున్నాయి. వారి ఐక్యతను ప్రజలు గతంలోనే అనేక మార్లు తిరస్కరించారు. అయినప్పటికీ ప్రజా తీర్పును పట్టించుకోని ఆ పార్టీలు మరోకమారు పరిషత్ ఎన్నికల్లో ప్రజల ముందుకు రాబోతున్నారు. అధికారంలో టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నందున ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగాలని టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థుల గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కైవసం చేసుకునే విధంగా టీఆర్‌ఎస్ అగ్రనా యకత్వం రంగంలోకి దిగింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నం దున్న వెంటేనే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని గెలుపుగుర్రాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నుంచి ఆదేశం రావడంతో ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్న నాయకులను గుర్తించే దిశగా టీఆర్‌ఎస్ పని చేస్తుంది. ఇప్పటికే రిజర్వే షన్లు ఖరార్ అయినందున ఏఏ గ్రామాలలో ఏ అభ్యర్థిని పోటీలో ఉంచితే గెలిచే అవకాశం ఉం టుందో వారినే పోటీలో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలపై బాధ్యతలు...
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఉంచారు. వారి నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీలను, మెజార్టీ ఎంపీ టీసీలను గెలిపించే విధంగా వ్యూహరచన చేయాలని సీఎం ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలున్నాయి. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, జడ్పీటీసీలను గెలిపించు కునే బాధ్యతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై ఉంచారు. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలు కూడా బలంగానే ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్ సింగిల్‌గా పోటీ చేసిన నాలుగు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం మెండుగా ఉంది. కాకపోతే నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకత్వం మొత్తం ఐక్యంగా ముందుకు పోతే గెలుపు సునాయసంగా ఉంటుందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. అదే విధంగా ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం జడ్పీటీసీ ఒక్క స్థానమే ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు.

ఈ మండలంలో విపక్షపార్టీలకు డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదని మండలంలోని అన్ని ఎంపీటీసీలను, జడ్పీటీసీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వైరా నియోజకవర్గంలో వైరా, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు జడ్పీటీసీలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లావుడ్యా రాముల్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్‌లు పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం, ముదిగొండ, మధిర జడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీటీసీ స్థానాలను గెలిపించే దిశగా ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, బొమ్మెర రా మ్మూర్తి, లింగాల కమల్‌రాజులు బాధ్యతలను పంచుకున్నారు. ఆయా మండలాల నుంచి ప్రజాబలం ఉన్న నాయకులను గుర్తించి వారినే రంగంలోకి దించేలా కార్యచరణను ప్రారంభించారు. సత్తుపల్లి నియో జకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండల జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ స్థానాలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మట్టా దయానంద్, పిడమర్తి రవి, మువ్వ విజయ్‌బాబులపై ఉంచడం జరిగింది.

టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న ఆశావహులు...
ఖమ్మం జడ్పీస్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ తరుఫున జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తుంది. జడ్పీ చైర్మన్‌స్థానం ఎస్సీ జనరల్ కావడంతో వివిధ మండలాల నుంచి ఆ వర్గానికి చెందిన నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాజకీయాలలో ఉన్నవారు కొందరు అయితే వేరే వృత్తులలో స్థిరపడిన వారు సైతం పోటీకి సై అంటున్నారు. జిల్లాలోని 20 మండలాలలో నాలుగు మండలాలు మాత్రమే ఎస్సీకి రిజర్వుడు అయ్యా యి. ఆ స్థానాలతో పాటు జనరల్ స్థానాలలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోటీ చేసేందుకు ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. అగ్రనాయకుల అండదండలను కోరుకుంటున్నారు. దీంతో జి ల్లాలోని కొన్ని మండలాలలో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేస్తారో తెలియని పరిస్థితి.

429
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles