శరవేగంగా రోడ్డు పనులు..

Sun,May 19, 2019 12:38 AM

రఘునాథపాలెం, మే18: ఇల్లెందు ప్రధాన రహదారిలో పాంగురంగాపురం నుంచి మండల కేంద్రం శివారు వరకు చేపట్టిన ఫోర్‌లైన్ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు లైన్లుగా ఉన్న ఇల్లెందు రోడ్డును ఫోర్‌లైన్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖమ్మం కార్పొరేషన్ పరిధి పాండురంగాపురం నుంచి రఘునాథపాలెం శివారులో గల నాగేంద్రమ్మ తల్లి ఆలయం వరకు నాలుగు లైన్ల రహదారిగా శోభాయమానంగా తీర్చిదిద్దుకోనుంది. నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరించేందుకు చేపట్టిన రహదారి పనులు గత రెండు నెలలుగా పరుగుల పెడుతున్నాయి. ఆర్ అండ్‌బీ అధికారుల నిత్య పర్యవేక్షణలో నాణ్యతతో కూడిన పనులు చేపట్టారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషితో రహదారి విస్తరణకు నిధులు తీసుకువచ్చారు. శంకుస్థాపన పనులు జరిగిన నాటి నుంచి రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. పనులను చేపట్టిన గుత్తేదారు పనులకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా శరవేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే రోడ్డుకు రెండు పక్కలా తారు పోయడం మిగిలిన విస్తరణకు పనులు పూర్తయ్యాయి. అంతేకాదు రఘునాథపాలెం స్టేజీ వద్ద కిలోమీటర్ మేర తారు నిర్మాణం సైతం పూర్తయింది. డివైడర్, సెంట్రల్ లైటింగ్‌తో జూన్ నెలాఖరుకు పూర్తయి ఇల్లెందు ప్రధాన రహదారి శోభాయమానంగా తీర్చిదిద్దుకుంటుందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

363
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles