పుస్తకాలొచ్చేశాయ్..!

Mon,May 20, 2019 03:05 AM

-21మండలాలకు చేరవేత
-25లోగా పాఠశాలలకు పంపిణీ
-జిల్లాలో 6.63లక్షలు పుస్తకాలు సిద్ధం
-పాఠశాల ప్రారంభం రోజునే అందుకోనున్న విద్యార్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్, మే 19: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం పాఠశాల ప్రారంభం రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా పది రోజుల ముందుగానే జిల్లాలోని 21 మండలాలకు అత్యధిక శాతం పాఠ్యపుస్తకాలను చేరవేశారు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు జిల్లాకు చేరాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ ప్రభుత్వ విద్య బలోపేతంలో ఒకింత ముందుగానే ఆలోచన చేస్తోంది. సమైఖ్య పాలనలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా.. అరకోర పుస్తకాలే విద్యార్థులకు అందేవి. అందుకు భిన్నంగా స్వరాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు వచ్చాయి. విద్యా సంవత్సరం ఆరంభలోనే పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాటు చేస్తున్నది.

కోడ్ ఆధారంగా పంపిణీ..
ప్రభుత్వ విద్యా విధానంలో సమూలమైన మార్పులను తీసుకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. అందులో భాగంగా పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీని పక్కాగా చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి పుస్తకానికి ఒక కోడ్ నెంబర్‌ను ముద్రించి జిల్లాకు చేర్చింది. జిల్లా, మండల, పాఠశాలల వారీగా అందిస్తున్న పుస్తకాల వివరాలను, కోడ్ నెంబర్లను నమోదు చేసింది. దీంతో పాఠ్య పుస్తకాల పక్కదారికి పుల్ స్టాప్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు పక్కదానరి పట్టకుండా ప్రబుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ప్రతి పాఠ్యపుస్తకానికి ఒక కోడ్ నెంబర్ ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ జిల్లాకు ఏఏ కోడ్ నెంబర్లను ముంద్రించిన పాఠ్యపుస్తకాలను పంపాలో నిర్ణయించి సరపరా చేస్తోంది. అంతేకాక మండలాలలకు అందించే పాఠ్యపుస్తకాలలోనూ జిల్లా కోడ్‌ల ఆధారంగా ముద్రించింది. దీని వల్ల ఏ కోడ్ నెంబర్ ముద్రించిన పాఠ్యపుస్తకం ఏ పాఠశాలలో పంపిణీ జరిగిందో ఇట్టే తెలిసిపోతోంది. ఫలితంగా ప్రభుత్వం అందించే ఏ ఒక్క పాఠ్య పుస్తకం పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఒక వేళ పక్కదారి పట్టినా విషయం బట్టబయలు అవుతోంది. గతంలో కొందరు విద్యాశాఖ సిబ్బంది లాలూచీతో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యనభ్యసించే విద్యార్థుల వద్ద దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశాలకు తావులేకుండా పాఠ్యపుస్తకాలపై కోడ్ ముద్రణతో పక్కదారికి చెక్‌పడింది.

మండలాలకు చేరిక..
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లు, కస్తూర్భా, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలు వంటి పాఠశాలలు మరికొన్ని ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1.5లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ప్రభుత్వమే ప్రతి ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ మీడియంతో కలిపి 174 రకాల పుస్తకాలు విద్యార్థులకు అవసరం ఉంటాయి. కాగా 2019-20 విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని అన్ని పాఠశాలలకు గానూ 6.63లక్షల పుస్తకాలు జిల్లాలోని అందజేయనున్నారు.

పర్యవేక్షిస్తున్న డీఈవో..
పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను డీఈవో మదన్‌మోహన్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన డైస్ లెక్కల ఆధారంగా పుస్తకాలు జిల్లాకు కేటాయించారు. ప్రతి పుస్తకం విద్యార్ధులకు చేరేలా పుస్తకాలు అందలేదనే ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు టెక్ట్స్‌బుక్ మేనేజర్, సెక్షన్ అధికారులతో సమీక్షిస్తున్నారు. మండలాల వారిగా పుస్తకాలను కేటాయించి ఆయా ఎంఆర్‌సీల నుంచి మండలంలోని పాఠశాలలకు చేరేలా ఎంఈవోలు చర్యలు తీసుకునేలా సూచనలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులకు సైతం పుస్తకాల అందజేతలో ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

376
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles