గొత్తికోయల ఆరోగ్యం, పోషణపై దృష్టి సారించండి..

Tue,May 21, 2019 12:43 AM

టేకులపల్లి: నాగరిక జీవనానికి దూరంగా ఉంటున్న గొత్తికోయల ఆరోగ్యం, పోషణ పట్ల వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది దృష్టిసారించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భాస్కర్‌నాయక్‌ సూచించారు. పారిశుధ్యం, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడంతో గొత్తికోయలు అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారని, ఇక మీదట అనారోగ్యంతో గొత్తికోయల మరణాలు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుందామని ఆయన అన్నారు. టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌ ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో గొత్తికోయలు నివాసం ఉంటున్న నాగారపుజోగు గ్రామాన్ని సొమవారం డీఎంహెచ్‌ఓతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం సందర్శించింది. గొత్తికోయల జీవన విధానం, ఆహరపు అలావాట్లు, పారిశుధ్య చర్యలను వారు పరిశీలించారు. ప్రధానంగా ఆరోగ్యం, పోషణపై సర్వే నిర్వహించారు. గొత్తికోయల పిల్లల్లో రక్తశాతం, ఎత్తుకు తగిన బరువు, తగినంత పౌషికాహారం అందుతుందా? అనే అంశాలపై ఆరా తీశారు. గ్రామంలోనే శిబిరం నిర్వహించి తల్లులకు, చిన్నారులకు రక్తపరీక్షలు నిర్వహించి రక్తశాతం తక్కువగా ఉన్నవారికి తగిన చికిత్స నిర్వహించారు. ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను గుర్తించి వారికి పోషకాహారం అందివ్వాలని సీడీపీఓ మంగతారకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి నరేష్‌కుమార్‌, గైనకాలజిస్టు లలిత, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ సుమన్‌, ఐసీడీఎస్‌ డీడబ్లూఓ శారద, సీడీపీఓలు మంగతార, కనకదుర్గా, సూపర్‌వైజర్లు అనురాధ, సీహెచ్‌ఓ నాగభూషణం, సీసీ శ్రీనివాస్‌, ఎల్‌టీ రామారావు, హెచ్‌ఎస్‌ పోరండ్ల శ్రీనివాస్‌, హెచ్‌వీ శకుంతల, ఎఎన్‌ఎంలు మానస, అరుణదేవి, హెచ్‌ఏ రాంబాబు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

276
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles