నకిలీ విత్తనాలు అమ్మితే జైలే.

Tue,May 21, 2019 12:43 AM

కొత్తగూడెం, నమస్తేతెలంగాణ: వ్యవసాయాన్ని నమ్ముకొని సాగుచేసే రైతన్నలకు విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో వ్యవసాయ, పోలీస్‌శాఖ సంయుక్తంగా నిర్వహించిన విత్తన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిండినిచ్చే అన్నదాత రైతన్న అని, అలాంటి వారిని మోసం చేయకూడదన్నారు. అధికారులు టీం వర్క్‌గా పనిచేసి రైతులను అప్రమత్తులను చేయాలన్నారు. నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి రాకుండా ఉక్కు పాదం మోపాలన్నారు. అందుకు అధికారులు విత్తనాల షాపులను అకస్మిక తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యత కల్గిన పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేసేలా అవగాహన పర్చాలన్నారు. డీఎస్పీ అలీ మాట్లాడుతూ.. రైతులు నష్టపోవడంలో కారుకులైన వారిని ఎవరినైనా విడిచి పెట్టేది లేదన్నారు. పోలీస్‌ అధికారులు నకిలీ విత్తనాలు అడ్డుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి కొర్సా అభిమన్యుడు మాట్లాడుతూ.. బిజి 1 శనగపచ్చ పురుగు నివారణకు వినియోగిస్తే, పొగాకు లద్దె పురుగు నివారణకు బిజి 2 వినియోగిస్తారని అన్నారు. మల్టీ నేషనల్‌ కంపెనీలు బీజీ 3 పేరుతో సరికొత్త వంగడం మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నారని దానిని నియంత్రించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు అబ్దుల్‌ బేగం, లాల్‌చంద్‌, తాతారావు పోలీస్‌శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. అనంతరం నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ చర్యలు అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles