జిన్నింగ్‌ మిల్లులు, విత్తన దుకాణాలపై దాడులు

Tue,May 21, 2019 12:43 AM

ఖమ్మం రూరల్‌, నమసే ్తతెలంగాణ: మండలంలోని జిన్నింగ్‌ మిల్లులు, విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. మండలంలోని తల్లంపాడులోగల శ్రీసాయి బాలాజీ జిన్నింగ్‌ మిల్లు, గుర్రాలపాడులోగల జీఆర్‌ఆర్‌ జిన్నింగ్‌ మిల్లును పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లంపాడులోగల విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఎడీఏ యాదయ్య మాట్లాడుతూ.. రైతులు విత్తనా కొనుగోలు చేసేటప్పుడు రశీదులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డీలర్లు కూడా కొనుగోలు చేసిన రైతుల వివరాలు, ప్యాకెట్‌ లాట్‌ నెంబర్లు నమోదు చేయాలన్నారు. ఎమ్‌ఎన్‌సీ కంపెనీకి సంబంధించిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని చెప్పారు. స్టాక్‌ రిజిస్టర్లు, స్టాక్‌ బోర్డులు తప్పకుండా పెట్టాలని చెప్పారు. లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే రైతులు బిల్లు తీసుకుని విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే తెలపాలని రైతులను కోరారు. నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్ట్ట్‌ కింద కేసు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. దాడులలో పాలేరు ఏడీఏ విజయచందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఏవోలు పృథ్వీరాజ్‌, నాగేశ్వర్‌రావు, ఏఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కూసుమంచి మండలంలో...
కూసుమంచి: మండలంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ హైదరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయం టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం సోమవారం తనిఖీ చేసింది. అన్నదాత ఫెర్టిలైజర్స్‌-పెస్టిసైడ్స్‌-సీడ్స్‌, మన గ్రోమోర్‌, లక్ష్మీగణపతి ఫెర్టిలైజర్స్‌-పెస్టిసైడ్స్‌-సీడ్స్‌ దుకాణాల్లోని స్టాక్‌ రిజిస్ట్టర్లను, గోదాముల్లో విత్తనాల నిల్వలను తనిఖీ చేసింది. రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు పౌచ్‌ నెంబర్‌, లాట్‌ నెంబర్‌ను బిల్లుల్లో నమోదు చేయాలని దుకాణాల యజమానులతో చెప్పారు. స్టాక్‌ రిజిస్ట్టర్‌, బోర్డు తప్పకుండా పెట్టాలని ఆదేశించారు. ఈ బృందంలో కమిషనరేట్‌ ఏడీఏ యాదయ్య, సీడ్స్‌ సర్టిఫికేషన్‌ అధికారి వీపీ పృధ్వీరాజ్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై జి.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. ఈ బృందం వెంట మండల వ్యవసాయాధికారి ఆర్‌.వాణి ఉన్నారు.

258
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles