గొత్తికోయల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..

Tue,May 21, 2019 12:43 AM

కొత్తగూడెం, నమస్తేతెలంగాణ : గొత్తికోయల కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోకి రాని గ్రామాల్లో నివాసముంటున్న గొత్తి కోయలు కుటుంబాల పిల్లలు, గర్భిణులు రక్తహీనతతో బాధ పడుతున్నారు. వారి కుటుంబాలకు మెరుగైన జీవితం అందించాలని వారి ఆరోగ్య పరిస్థితులపై కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందుకోసం వైద్య, అంగన్‌వాడీ శాఖలను ఒక కమిటీగా నియమించి ప్రతీ రోజు గొత్తికోయల గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. దీంతో ఆ కమిటీ బృందం గత వారం రోజుల నుంచి గొత్తికోయ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చర్ల, పినపాక, ములకలపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆ బృందం గొత్తికోయల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన చేసుకున్నారు. వారి పిల్లలకు రక్తహీనత ఉన్నట్లు, గర్భిణులు కూడా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం లేదని గమనించారు. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే దానిపై ఆ బృందం తగు చర్యలు తీసుకుంటుంది. పిలల్లకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంగన్‌వాడీ ద్వారా వారికి బాలామృతం పంపిణీ చేస్తున్నారు. రక్తహీనతతో ఉన్నవారికి వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. సోమవారం గుండాల, టేకులపల్లి మండలాల్లో పర్యటించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భాస్కర్‌నాయక్‌, సీడీపీవో శారద, ప్రత్యేక వైద్యులు, సూపర్‌ వైజర్లు కూడాఉన్నారు.


252
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles