నిబంధనలు లేవా.. ఐతే నోటీసులే..!

Tue,May 21, 2019 12:45 AM

-పాఠశాలల వివరాల సేకరణ
-పాటు చర్యలకు సిద్ధం

ఖమ్మం ఎడ్యుకేషన్‌, మే 20:విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి.. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించేవిగా నిలబడాలి.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి... కానీ కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి.. ఎలాంటి అనుమతులు లేకుండా ‘ధన’మే పరమావధిగా ప్రవేశాలు చేస్తున్నాయి. ఇలాంటి పాఠశాలలను కట్టడి చేసేందుకు డీఈఓ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల వివరాలు ప్రస్తుత స్టేటస్‌తో అందజేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వాటికి తొలుత నోటీసులు, ఆ తర్వాత సీజ్‌ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్ధలు ఎంత ఆదర్శంగా ఉండాలి.. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేలా నిలబడాలి.. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి.. క్రమశిక్షణ, తప్పు ఒప్పులను సరిదిద్దాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలను యథేచ్ఛగా ధిక్కరిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ‘ధన’మే పరమావధిగా ప్రవేశాలు చేస్తున్నాయి. విద్యార్థులకు కల్లబోల్లి మాటలు చెబుతూ వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నాయి. ఇలాంటి పాఠశాలల ఆటలు కట్టిస్తూ కట్టడి చేసేందుకు డీఈవో ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల వివరాలు పూర్తి స్థాయిలో మండలాల వారీగా ప్రస్తుత స్టేటస్‌తో అందజేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా నిబంధనలు లేని వాటిని కలెక్టర్‌, విద్యాశాఖ ఉన్నాతాధికారుల సూచనల మేరకు తోలుత నోటీసులు, తర్వాత అవసరమైన సీజు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.

నిబంధనలు లేని వాటిపై ప్రచారం..
విద్యా సంవత్సరం పునఃప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో విద్యార్థులు ప్రవేశాలు తీసుకుని తర్వాత ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోనున్నారు. ముందస్తు అనుమతి లేని వాటితో పాటు ఇష్టానుసారం షిప్టింగ్‌, కనీసం ఓపెనింగ్‌ పర్మిషన్‌ లేకుండా నిర్వహణ సాగిస్తున్న పాఠశాలల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయనున్నారు. అందరిని అప్రమత్తం చేసేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏఏ పాఠశాలలకు అనుమతులు లేవు, విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలనే అంశాలనే అప్రమత్తం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ, అనుమతులు అనే వాటిపై అవగాహన లేని విద్యార్థులు తల్లిదండ్రులు మాయదారి పాఠశాలలల్లో చేర్చి విద్యా సంవత్సరం నష్టపోతున్నారు. విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత కాని వారు తెలుసుకోలేని పరిస్ధితి. ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేయనున్నారు.

వ్యాపారానికి కాదేదేది అనర్హం అన్నట్లుగా విద్యా వ్యవస్థనే వ్యాపారంగా మార్చి, తల్లిదండ్రులను ఏ మార్చి ఎలాంటి అనుమతులు లేకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. పాఠశాల నిర్వాహణకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ప్రవేశాలు చేయాలి. కానీ పర్మిషన్‌ లేకముందే, పర్మిషన్‌ గడువు పూర్తయిన రెన్యూవల్‌ కాకపోయిన ‘ధన’దాహంతో అడ్మిషన్లు చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలను చదరంగంలా చేసి ఆటలు ఆడుతున్నారు. ఆకర్షణీయమైన పేర్లను పెట్టి మల్టీ కలర్‌ ఫుల్‌ బ్రోచర్లతో తమ పదునైన మెప్పించగల గారడి మాటలతో మాయ చేస్తూ బుట్టలో పడేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఈ తరహా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్రీ స్కూల్‌గా ప్రారంభించడం విద్యార్థులను రూ.20వేల వరకు ఫీజులు వసూల్‌ చేయడం, ఆ తర్వాత కూడా దానిని విస్తరించడం ఇలా తంతు సాగుతుంది. ఇష్టానుసారం నిర్వహణ సాగుతున్న పాఠశాలల వివరాలు ఆధారంగా నేరుగా అవసరమైన పాఠశాలలపై డీఈవోనే తనిఖీలు చేయనున్నారు. తనిఖీల అనంతరం నోటీసులు ఇవ్వడంతో పాటు వారిచ్చే సమాధానాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకునేలా ఆలోచనలు చేస్తున్నారు.

వివరాలు సేకరిస్తున్న ఎంఈవోలు
పాఠశాల నెలకొల్పడం.. అనుమతి కోసం ప్రయత్నించడం అన్ని సక్రమంగా లేకపోవడం, అయినా అనుమతులు వస్తున్నాయని చెప్పి ప్రవేశాలు చేయడం పరిపాటిగా మారింది. వినూత్నమైన పేర్లతో ప్రచారం చేస్తుండడంతో తల్లిదండ్రులకు కూడా పాఠశాలల పర్మిషన్స్‌పై అనుమానం రాదు. ఒక వేళ అనుమానం వస్తే ఎదో ఒక కాగితాలు చూపించి నేడో రేపో వస్తుందని చెప్పడం ప్రవేశాలు చేయడం అలవాటుగా మారింది. ఇలా అనుమతులు లేని పాఠశాలలు ఏ సంవత్సరం నుంచి నడుస్తున్నాయి..? వీటికి ఏమైనా నోటీసులు ఇచ్చారా..? అనే ఆధారంగా పూర్తి స్ధాయిలో మండల విద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమతులు ఉన్న స్కూల్‌ పేరు ఒకటి అయితే పేరు మార్చి వేరొక చోట నిర్వహణలో ఉన్న పాఠశాలల వివరాలు, ఏ అనుమతులు లేకుండా పేర్లు మార్పు, స్థలం మార్పులపై నోటీసులు ఇచ్చేందుకు అనుమతులు ఉన్న స్కూల్‌ అడ్రస్‌లు గల యాజమాన్యానికి, ప్రస్తుతం ఉన్న వారి అడ్రస్‌లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లేస్కూల్స్‌, ప్రైమరీ స్కూల్స్‌పై కొంచెం కఠినంగా స్పందించనున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక చర్యలకు సిద్ధం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిర్వహణ పాటించని ప్రైవేట్‌ స్కూల్స్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నమూనా సిద్ధం చేశారు. ఆ నమూనాను జిల్లాలోని అందరి ఎంఈవోలకు అందజేసి వివరాలు సేకరిస్తున్నారు. 12 అంశాలతో కూడిన ఫార్మాట్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఏ మీడియం, ఏ తరగతి వరకు అనుమతులు ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నారు. మంగళవారం నాటికి డీఈవో కార్యాలయంలో ఎంఈఓలు నివేధికలను సమర్పించనున్నారు. నివేధికల ఆధారంగా అనుమతులు లేని స్కూల్స్‌, షిప్టింగ్‌ అనుమతి లేనివి, ప్రైమరీ అనుమతి లేనివి ఇలా విభాగాలుగా విభజించి వాటికి విద్యాశాఖ జీవోల ఆధారంగా ఏ చర్యలు తీసుకోవచ్చో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. గురువారం లోగా అన్ని మండలాల నుంచి పూర్తి స్థాయిలో నివేధికలను తెప్పించుకుని, వాటిని ఉన్నాతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం.

378
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles