లచ్చునాయక్‌కు తుమ్మల నివాళి

Thu,May 23, 2019 12:28 AM

కూసుమంచి: కూసుమంచి జడ్పీటీసీ సభ్యుడు వడ్త్యా రామచంద్రునాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మృతి చెందాడు. మండల పరిధిలోని లోక్యాతండాలో బుధవారం నిర్వహించిన లచ్చునాయక్ దశదిన కర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ రామచంద్రునాయక్‌ను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన టీఆర్‌ఎస్ మండల నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, వీరవెల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి ఆసిఫ్‌పాషా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ జొన్నలగడ్డ రవికుమార్, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్‌రావు, జీళ్లచెరువు ఎంపీటీసీ ఇంటూరి శేఖర్‌రావు, నాయకులు ముదిరెడ్డి కేశవరెడ్డి, మల్లీడు వెంకటేశ్వర్లు, మాదాసు ఉపేందర్‌రావు, జర్పుల బాలాజీనాయక్, అర్వపల్లి జనార్దన్‌గౌడ్, సేట్రాంనాయక్ పాల్గొన్నారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles