ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు అర్థరహితం

Thu,May 23, 2019 12:28 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు అర్థరహితమని స్వేరోస్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు దార మమత ఖండించారు. ఆరోపణలు చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె బుధవారం ఇక్కడ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ప్రతిభను ఎవరెస్ట్ట్ ఎక్కించి, ప్రపంచ పటంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల విద్యావిధానం ప్రారంభమై ఎన్నో సంవత్సరావుతోందన్నారు. ఇన్నేళ్లలో దళిత విద్యార్థుల అభ్యున్నతిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. అలాంటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో గురుకుల విద్యను ముఖ్యమంత్రి కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను సెక్రటరీగా నియమించారని చెప్పారు. ఐపీఎస్ ఆఫీసరైన ప్రవీణ్‌కుమార్, నిరుపేద విద్యార్థులకు సేవ చేయాలన్న తపనతో శ్రమిస్తున్న, విజయాలు సాధిస్తున్న సెక్రటరీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ గురుకుల విద్యార్థులను ప్రపంచ పటంలో నిలిపిన గొప్ప వ్యక్తి ప్రవీణ్‌కుమార్ అని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యను బలోపేతం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలకు అనుగుణంగా కేజీ టు పీజీ ఉచిత విద్యనందించే లక్ష్యంతో ప్రవీణ్‌కుమార్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రేణుక, ముత్యం, సునిత, లలిత, వీరమ్మ, రమాదేవి, అన్నపూర్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles