యువతి ఆత్మహత్యాయత్నం

Thu,May 23, 2019 12:29 AM

మయూరిసెంటర్, మే 22: కొన్ని సంవత్సవరాలుగా ఒకరినోకరు ప్రేమించుకుని జీవిత భాగస్వామ్యులమవుదామని వాగ్దానాలు చేసి ఒక్కటవుదామని నమ్మబలికి చివరకు ససేమిరా అన్నాడు ఆ ప్రియుడు. ప్రియుడి మాటలు నమ్మి యువతి, యువతి తల్లిదండ్రులు ఆ కుర్రాడితోనే వివాహం నిశ్చయించి, ఈ నెల 23వ తేదీన అంగరంగ వైభవంగా ఇద్దరి కల్యాణాన్ని నిర్వహిందామనుకున్నారు. చివరకు ప్రియుడు ప్రేయసిపై మోజు తీరడంతో మాట దాట వేస్తూ యువతిని వంచించాడు. ఆ యువతిని వదిలించుకుందామనుకుని అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడానికి కారణం ఆ ప్రియుడే అయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆ యువతి ఏన్కూరు మండలంలో ప్రియుడి గ్రామంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విషయం తెలసుకున్న యువతి తల్లిదండ్రులు హుటాహుటిన ఆ యువతిని ఆ జిల్లా కేంద్ర ప్రధాన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ వైద్యులు సూచించండంతో జిల్లా కేంద్రంలోని వైరా రోడ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో ఆ యువతిని చేర్పించారు. యువతి శ్వేత తండ్రి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఏన్కూరు మండలం రాయమాధారం గ్రామానికి చెందిన శ్వేత అదే మండలం జన్నారం గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమవివాహానికి నిర్ణయం తీసుకుంది. ఆందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. గత వారం రోజుల నుంచి పెళ్లి పత్రికలు ముద్రించి నూటికి నూరు శాతం ఆ పత్రికలను బంధువులకు పంపిణీ చేశారు. ఇటీవల తమ కూతురితో వివాహం ఇష్టం లేదని ఆ కుర్రాడు మోరాయించడంతో ఏన్కూరు ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించి కౌన్సెలింగ్ ఇప్పించినా కూడా ఆ కుర్రాడు వేరే వివాహనికి సిద్ధం కాకపోవడంతో తన కూతురు బుధవారం ఉదయం కుర్రాడి గ్రామమైన జన్నారంకు వెళ్లి అక్కడ ఎలుకల మందును తాగిందని బాధితురాలి తండ్రి పేర్కొన్నాడు. ఇంతకాలం నుంచి తన కూతురితో ప్రేమ వివాహం నడిపిన ఆ కుర్రాడు వారి బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుని తన కూతురిని వదిలించుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు పెళ్లి పత్రికలు పంచామని, వివాహానికి కొన్ని గంటల సమయం ఉండగానే ఇలా తన కుమార్తెను మోసగించడం సరైనది కాదన్నారు. తన కూతురు శ్వేత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుందని తెలిపారు. జిల్లా న్యాయమూర్తి శ్వేత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో శ్వేత చిన్న కూతురని తెలిపారు.

245
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles