మూడంచెల పటిష్ట భద్రత

Thu,May 23, 2019 12:29 AM

ఖమ్మం క్రైం, మే 22: ఖమ్మం పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌శాఖ మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్‌కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. బుధవారం కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రామంలో ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తుపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11న పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలు ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను సంబంధిత ఎన్నికల అధికారుల పర్యవేక్షణ, కేంద్ర బలగాల పహారా మధ ్య విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడం జరిగిందన్నారు. వీటిని 40 రోజులుగా కేంద్ర బలగాలు, సివిల్, ఆర్మూడ్ రిజర్వుడ్, ఫోర్స్ బలగాలతో మూడంచెల పటిష్ట భద్రతతో బందోబస్తు కొనసాగించినట్లు సీపీ తెలిపారు కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్లలెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఓట్లలెక్కింపు బందోబస్త్‌లో అడిషనల్ డీసీపీతో పాటు ఏసీపీలు-10, సీఐలు-15, ఎస్‌ఐలు-33, 400 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు.

పోలీస్‌కమిషనరేట్ పరిధిలో జూన్ 4వతేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీస్ అధికారులకు సహకరించాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సెక్షన్ 144, సీఆర్‌పీసీను జూన్ 4 వరకు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, కల్లూరు ఏసీపీ వెంకటేష్, సీఐ రమాకాంత్, ఏసీబీ సీఐలు సంపత్‌కుమార్, రవీందర్ పాల్గొన్నారు.

279
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles