తల్లీబిడ్డల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Thu,May 23, 2019 12:31 AM

-జిల్లాలో 102 సేవలు భేష్..
-అమ్మకు ఆత్మీయత బిడ్డకు ప్రేమతో..
-గర్భిణులకు ఉచిత రవాణా సదుపాయం
-11 వాహనాల ద్వారా సేవలు ముమ్మరం
మయూరిసెంటర్, మే 22: తల్లిబిడ్డల క్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తూ విద్యా, వైద్య, ఆరోగ్య విభాగాల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 102 వాహనాల ద్వారా గర్భిణులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వారి ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చి ఏఎన్‌సీ చెకప్‌లు చేయించి తిరిగి వారి నివాసాలకు ఉచిత రవాణా, వైద్యసేవలను జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్ విభాగాలు కృషి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 12 మంది ఫైలెట్లు పదకొండు 102 వాహనాల ద్వారా ఈ ఉచిత సేవలను గర్భిణులకు అందిస్తూ మొదటి సాధారణ కాన్పూ జరిగే విధంగా వైద్యులు, 102 సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క గర్భిణీ 102 వాహనాలను సద్వినియోగం చేసుకుని మొదటి నెల గర్భం దాల్చిన దగ్గర నుంచి మొదలుకుని బిడ్డకు 12 నెల ప్రాయం వచ్చేవరకు వ్యాక్సినేషన్ అందించేందుకు ఈ 102 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆశా కార్యకర్తలు, ఎన్‌ఎంల సహకారంతో గర్భిణులు తల్లిబిడ్డ క్షేమం కోసం ప్రసవం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యుల సూచనను పాటించి ఈ వాహన రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. గర్భిణీలు ఇంత దూరం వరకే ప్రమాణికమనే వ్యత్యాసం లేకుండా ఎంత దూరంలో వారి నివాసాలున్నా అక్కడి నుంచి గర్భిణులను జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి సేవలందిస్తూ 102 సిబ్బంది సేవలు భేష్ అనేలా ఉన్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

నయా పైసా ఖర్చులేకుండా గర్భిణులకు ఉచిత సేవలను అందించేందుకు జిల్లా వైద్యశాల కార్పొరేట్ వైద్యశాల తరహాలో ఆధునిక హంగులతో నూతన పరికరాలతో వైద్యసేవలు అందింస్తుంది. అమ్మకు అత్మీయతా.. బిడ్డకు ప్రేమతో.. అనే నిర్వచనాన్ని నిజం చేస్తూ 102 సిబ్బంది కృషి అభినందనీయం. బోనకల్ ప్రాంతంలో గర్భిణులకు సేవలందించేందుకు మరో రెండు వాహనాలు ఆ ప్రాంతానికి కేటాయించినట్లు 102 జిల్లా కో ఆర్డినేటర్ రాణి పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 80 మంది గర్భిణులకు రవాణా, వైద్యసేవలను అందిస్తున్నట్లు ఆమె వివరించారు.

280
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles