నా గెలుపు నియోజకవర్గ ప్రజలదే..

Fri,May 24, 2019 12:37 AM

-ఓటు వేసి భారీ మెజార్టీ అందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
-కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా...
-నాయకులందరితో అన్నాతమ్ముడిలా ఉంటా...
-జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా
-విలేకరుల సమావేశంలో నామా నాగేశ్వరరావు

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఇది నా ఒక్కడి గెలుపు కాదని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల గెలుపు అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు అన్నారు. గురువారం సాయంత్రం విజయ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ పూర్తయిన తరువాత నామా విలేకరులతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా 1లక్షా 68 వేల ఓట్ల మెజార్టీని ప్రజలందించారన్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత మెజార్టీ గతంలో ఎప్పుడూ రాలేదని, తనకే గతంలో 1లక్షా 25వేల మెజార్టీ వచ్చిన మెజార్టీని నామా గుర్తుచేశారు. తన గెలుపు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని జిల్లా ప్రజలే బలపరిచారని, సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటు కానుకగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలు, మహిళలు, రైతులు, యువకులకు కృతజ్ఞతలని, నాయకులందరికీ ధన్యవాధాలు తెలుపుతునాన్నారు. నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నాయకులతో అన్నదమ్ములా కలిసి నడుస్తానన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖమ్మం వైపు చూశారని, ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ గెలవడం కష్టంగా ఉందని అనేక మంది పేర్కొన్నారని, అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదించడం గర్వంగా ఉందన్నారు. అందరి వాడిగా ఉంటానని, అందరితో వారి కుటుంబ సభ్యులుగా ఉంటూ కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ఖమ్మం మేయర్ జీ పాపాలాల్, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు బొమ్మెర రామ్మూర్తి, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులున్నారు.

287
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles