సమష్టి కృషి వల్లే నామా గెలుపు : పిడమర్తి

Sat,May 25, 2019 01:53 AM

కల్లూరు, మే 24: ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలవడం పట్ల నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నామాకు భారీ మెజార్టీ రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఉపశమనం పొందినట్లయింది. గడిచిన 45 రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూసిన లోక్‌సభ ఫలితాలు ఎట్టకేలకు విజయోత్సహాన్ని మోసుకొచ్చాయి. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 31,937 ఓట్ల మెజార్టీ రావడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుల వ్యూహం ఫలించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 280 పోలింగ్ బూత్‌లకుగాను ప్రతి 14 పోలింగ్ కేంద్రాలను ఒక రౌండ్‌గా పరిగణలోకి తీసుకుని నియోజకవర్గంలో పోలయిన 179926 ఓట్లను 20 రౌండ్లలో లెక్కించారు. ప్రతి రౌండ్‌లోను టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుదే పైచేయిగా నిలవడంతో కౌంటింగ్ కేంద్రం వద్దే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు అప్పటి ప్రత్యర్థి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సుమారు 16,340 ఓట్ల తేడాతో ఓటమి పాలయినప్పటికీ, అధికార టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేయడంతో భారీ మెజార్టీ సాధ్యపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేస్తూ మిఠాయిలు పంచారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సత్తుపల్లి నియోజకవర్గ మెజార్టీ అధికం.

236
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles