నామాకు టీఆర్‌ఎస్ నాయకుల సన్మానం

Sat,May 25, 2019 01:54 AM

చింతకాని, మే 24 : టీఆర్‌ఎస్ చింతకాని మండల, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు ఖమ్మంలోని ఎంపీ నివాసంలో ఎంపీ నామా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు పూలమాలలు, బోకేలు, శాలువాలతో సన్మానం చేశారు. మండలంలో పార్టీ సమన్వయంతో పని చేసి అసెంబ్లీ కంటే ప్రతిపక్ష పార్టీలకంటే మెరుగైన ప్రదర్శన కనబరచిందని, ఇదే ఒరవడిని భవిషత్తులో కొనసాగించాలని పార్టీ నాయకులనుద్దేశించి ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేసిన గ్రామ, మండల పార్టీ నాయకులకు, సర్పంచులు, ఎంపీటీసీలకు, రైతు సమన్వయ సమితి సభ్యులుకు, అనుబంధ సంఘాల నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావును కలసిన వారిలో ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, జడ్పీటీసీ అభ్యర్థి పర్సగాని తిరుపతి కిషోర్, ఆయా గ్రామ మాజీ, ప్రస్తుత సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు.
చింతకాని మండలంలో తిరుగులేని శక్తిగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అవతరించినదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు మండలంలో రెండో స్థానానికి పరిమితమైన అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ ఫలితాల్లో ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో ఉండడం గమనార్హం. టీఆర్‌ఎస్ మండల, గ్రామ కమిటీలు సమన్వయంతో పనిచేసి సంపూర్ణ విజయాన్ని సాధించడంలో ఉమ్మడి విజయం సాధించారనడంలో ఏలాంటి సందేహం లేదు.

257
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles