కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం..

Sat,May 25, 2019 01:56 AM

-కార్యకర్తల కష్ట ఫలితమే నా విజయం
-నాయకులందరితో అన్నా తమ్ముడిలా ఉంటా..
-జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తా..
-సీతారామా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా పని చేస్తా..
-తెలంగాణలో వచ్చిన ఫలితాలపై కేసీఆర్, కేటీఆర్‌లు సమీక్షిస్తారు
-సమావేశంలో నామా నాగేశ్వరరావు
ఖమ్మం, నమస్తే తెలంగాణ : పార్టీ అధినేత ఏది ఆదేశిస్తే అది చేయడమే నా కర్తవ్యమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎంపీగా గెలుపొందిన నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నామా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, నాకు పార్టీ ముఖ్యమన్నారు. పార్టీ విధానాలను అమలు చేయడం, అధినేత చెప్పింది చేయడమే తాను నేర్చుకున్నానని, గతంలో నీను ఉన్న పార్టీలో కూడా అదే చేశానన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఇది నా ఒక్కడి గెలుపు కాదని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల గెలుపు అన్నారు. ఖమ్మం ప్రజలు చరిత్రను తిరగరాశారన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఖమ్మంలో ఎవ్వరికి రాని మెజారిటిని నాకు ఇచ్చారన్నారు. పార్టీలకు అతీతంగా లక్షా 68 వేల ఓట్ల మెజార్టీని ప్రజలందించారన్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత మెజార్టీ గతంలో ఎప్పుడు రాలేదని, తనకే గతంలో 1లక్షా 25 వేల మెజార్టీ వచ్చిన మెజార్టీని నామా గుర్తు చేశారు. తన గెలుపు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని జిల్లా ప్రజలే బలపరిచారని, సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటు కానుకగా ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని నాయకులందరూ ఐక్యంగా కలిసి పని చేయడం ద్వారా ఘన విజయం సాధించామన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు, యువకులకు కృతజ్ఞతలని, నాయకులందరికీ ధన్యవాధాలు తెలుపుతున్నా అన్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులతో అన్నదమ్ములా కలిసి నడుస్తానన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖమ్మం వైపు చూశారని, ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ గెలవడం కష్టంగా ఉందని అనేక మంది పేర్కొన్నారని, అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదించడం గర్వంగా ఉందన్నారు. అందరి వాడిగా ఉంటానని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి, జిల్లాకు రావాల్సిన నిధుల విషయంలో కేసీఆర్ ఆదేశాల ప్రకారం కృషి చేస్తానన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని , ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తానన్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గతంలో పార్లమెంట్‌లో చర్చించానన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు తాను కూడా అదే సభలో ఉన్నానని, బిల్లుపై తొలి సంతకం తనదేనని అన్నారు. మరొక ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని, వారందరకి కృతజ్ణతలు తెలుపుతున్నానన్నారు.

ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకపోయేలా పని చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు సమీక్షిస్తారని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నియోజకవర్గాల వారీగా జరిగిన లోటు పాట్లపై సమగ్రంగా చర్చిస్తారని అన్నారు. ప్రజా క్షేత్రంలో ఎవరైనా ప్రజల నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని, వారు ఏది ఆదేశిస్తే అదే ఫైనల్ అన్నారు. ఎన్నికల విధులను అమర్దవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఇతర అధికారులకు నామా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ఖమ్మం మేయర్ జీ పాపాలాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కమర్తపు మురళి, బీరెడ్డి నాగచంద్రరెడ్డి, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

328
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles