సమర్థవంతమైన విచారణ జరిగినప్పుడే బాధితులకు న్యాయం..

Sat,May 25, 2019 11:58 PM

ఖమ్మం క్రైం, మే 25: కేసుల్లో సమర్థవంతమైన విచారణ జరిగినప్పుడే నిందితులకు శిక్షపడి బాధితులకు న్యాయం జరుగుతుందని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఇంజరాపు పూజ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఇనివెస్టిగేషన్ ప్రోసిసర్ ఫ్రామ్ ఎఫ్‌ఐఆర్‌టూ చార్జీషీట్ అంశాలలో ఇటీవల న్యాయస్థానం వెలువర్చిన తాజా తీర్పులు, చట్టసవరణలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్ మొదలు చార్జ్‌షీట్ వరకు ప్రతి అంశంలో నిబద్దతో దర్యాప్తు కొనసాగితే నిందిలకు శిక్షపడి తద్వారా బాధితులకు న్యాయం జరిగి ప్రజలకు పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. నేరస్తులకు శిక్షపడేలా చేయడంలో కీలకమైన బాధ్యతలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై ఉంటుందన్నారు.

ఇకపై ఏదైనా కేసులలో సక్రమ పద్దతిలో విచారణ జరిగలేదని, ఎస్‌హెచ్‌ఓ విచారణా అధికారి తప్పిదం వల్ల న్యాయస్థానాలలో కేసులు కొట్టివేసినట్లయితే సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టు ప్రాసెస్ ప్రకారం సరైన సమయంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం, న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ఎప్పటికప్పుడు సాక్షులను ఎగ్జిమిన్ చేయడం, వారెంట్స్ సమన్లు, నాన్‌బెయిల్‌బూల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో న్యాయస్థానంలో సీసీ నెంబర్స్ పొందడంలో చురుకుగా వ్యవహరించాలన్నారు. వివిధ కేసులలో న్యాయస్థానం ఇచ్చే తిర్పులను పరిగణలోకి తీసుకుని విచారణలో పోలీస్ అధికారులు చేసిన తప్పిదాలను పరిశీలించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిజాంబాద్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ. రామిరెడ్డి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏసీపీలు సదానిరంజన్, రామానుజం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.

277
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles