ది బోల్డ్ న్యూ టీయూవీ-300 కారు మార్కెట్‌లోకి విడుదల

Sat,May 25, 2019 11:58 PM

-ముఖ్య అతిథిగా ఆవిష్కరించిన డీటీవో భద్రూనాయక్
రఘునాథపాలెం, మే25: సరికొత్త మోడల్ కార్ల తయారి దిగ్గజ మహీంద్రా సంస్థ మరో నూతన కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. ది బోల్డ్ న్యూ టీయూవీ-300 పేరుతో కస్టమర్ల ముందుకు తీసుకవచ్చింది. శనివారం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌లో గల వీవీసీ మోటార్స్ షోరూం నందు ఈ నూతన కారు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ఖమ్మం జిల్లా రవాణాశాఖాధికారి భద్రూనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మహీంద్రా కంపెనీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన కార్ల తయారీ సంస్థ అన్నారు. అనంతరం వీవీసీ మోటార్స్ ఎండీ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నూతన కారు ది బోల్డ్ న్యూ టీయూవీ-300 విశిష్టతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీవోవో వెంకటేశ్వర్లు, సీఎఫ్‌వో లకా్ష్మరెడ్డి, సీఏవో వెంకటేశ్వరరావు, వెంకన్న, సేల్స్ జీఎం బీవీ రావు పాల్గొన్నారు.

277
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles