కేసుల్లో పురోగతిని సాధించాలి

Sat,May 25, 2019 11:58 PM

ఖమ్మం క్రైం: నేరాలు నియంత్రణకు నిర్దిష్టమైన ప్రణాళికలతో ఉండి, కేసులలో పురోగతి సాధించినప్పుడే పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఏర్ప డుతుందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఖమ్మంటౌన్, ఖమ్మం రూరల్, సెంట్రల్ క్రైం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్‌లో చోరీ కేసులలో పురోగతి ఉండటం లేదని, వెంటనే వాటిపై దృష్టిసారించి కేసులు నమోదు చేసే సమయంలో చురుకుగా వ్యవహరించాలన్నారు. రాత్రివేళల్లో చోరీలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీస్ పెట్రోలింగ్, బీట్ విధులు ముమ్మరం చేయాలన్నారు. చోరీ సొత్తు రికవరీపై పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించి కేసులలో త్వరితగతిన పురోగతి సాధించాలని ఆదేశిం చారు. విజబుల్ పోలీసింగ్ ద్వారా తనిఖీలు ముమ్మరం చేసి భవిష్యత్‌లో నేరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో హో టళ్లు, లాడ్జీలు, బస్టాండ్,రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాల న్నారు.

వివిధ కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన నేరగాళ్లపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. చోరీ కేసుల దర్యాప్తులలో టెక్నికల్ ఎవిడెన్స్, క్వాలిటి ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజు రోల్‌కాల్‌లో భాగంగా సిబ్బందితో విధులకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలన్నారు. నేను సైతం, కమ్యూనిటి పోలీ సింగ్ కార్యక్రమాల్లో వివిధ ప్రజల వర్గాల ప్రజలను భాగస్వామ్యులుగా చేసి పట్టణ, గ్రామాలలో, కాలనీలలో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో మమేకం కావాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఇంజారాపు పూజ, ఏసీపీలు రామోజీరమేష్, ఎస్‌బీ ఏసీపీ సత్యనారాయ ణ, డీసీఆర్‌బీ ఏసీపీ రామానుజం, సీఐలు రమేష్,నరేందర్, షూకూర్, సాయిరమణ, వసంత్‌కుమార్, శివసాంభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

276
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles