రాష్ట్ర అవతరణ వేడుకలకు మంత్రి తలసాని

Sat,May 25, 2019 11:58 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా న్ని ఘనంగా నిర్వ హించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జూన్ 2 న నిర్వహించే రాష్ట్ర అవత రణ దినోత్సవవేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసేందుకు ఖమ్మం జిల్లాకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కేటా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2 న నిర్వహించే రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవవేడుకలను అదిరిలే నిర్వహించా లని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో పాఠశాలలకు సెలవు లను కూడా పొడిగించారు. సోమవారం నుంచి అధికార యంత్రాంగం అవతరణ దినో త్సవ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నం కానుంది.

292
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles