ప్రమాద రహిత జిల్లాగా మార్చుకుందాం..

Sat,May 25, 2019 11:58 PM

-జిల్లా రవాణాశాఖాధికారి భద్రూనాయక్
రఘునాథపాలెం: ఖమ్మాన్ని ప్రమాద రహిత జిల్లాగా మార్చు కోవడంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లు సహకరించాలని జిల్లా రవాణాశాఖాధికారి భద్రూ నాయక్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులను నడిపే డైవర్లకు శనివారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో ఫ్రెషర్స్ ట్రైనింగ్ కోర్స్ పేరుతో శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2019-20విద్యా సంవత్సరంలో ప్రమాదాలు జరగని జిల్లాగా నమోదుకావడంలో బస్సు డ్రైవర్లు, కరస్పాండెంట్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం ఈ ఏడాది పాఠశాల, కళాశాలల బడి బస్సుల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. బస్సును నడిపే డ్రైవర్లు అనుభవజ్ఞలైన వారినే పెట్టుకో వాలన్నారు. వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పక ఉండేలా చూసుకో వాలన్నారు. చిన్న తప్పు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని, తద్వారా తమ కళాశాల తీరని మచ్చని తెచ్చుకోవద్దని సూచించారు. ఈ సంద ర్భంగా ఫిట్‌నెస్ కోసం కార్యాలయానికి వచ్చే సమయంలో బస్సుల్లో పాటించాల్సిన నిబంధనలను ఆయన వివరించారు.

అనుమతులు లేకుండా పాఠశాలల బస్సులు నడిపినా..నిబంధనలు విస్మరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల బస్సుల నిబంధనల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.రవాణాశాఖ నిబంధనలు పాటించని పాఠశాల బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రహదారి ప్రమాదాలు నివారించేం దుకు సాధారణ తనిఖీలతో పాటు పాఠశాలల బస్సులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ప్రతి బస్సులో విద్యార్థుల వివరాలతో పాటు సహాయకుని వివరాలు కచ్చితంగా ప్రదర్శించాలని..సీట్ల సంఖ్యకు మించి విద్యార్థులను తరలించినా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

అనంతరం సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ..పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు సైతం బస్సుల నిర్వహణలో జాగ్రత్తలు పాటించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శంకర్ నాయక్, ఏఎంవీఐ కిశోర్‌బాబు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీ.రాంచందర్‌రావు, సెక్రటరీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

276
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles