మాజీ మంత్రి తుమ్మలను కలిసిన ఎంపీ నామా

Mon,May 27, 2019 02:36 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు స్వగృహంలో ఆయనను ఖమ్మం ఎంపీ నా మా నాగేశ్వరరావు ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిని మరొకరు శాలువాలు కప్పి స న్మానించుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ అత్యధిక మెజార్టీ సాధించి, రికార్డు సృష్టించారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో అమలు అవుతున్న పథకాలు.. ఫలితాలు... మెజార్టీ రూపంలో కనిపించాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో తనవంతు కృషి, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో ఐక్యంగా భవిష్యత్‌లో ముందుకు కదులుదామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మాయ్య, చిత్తారు సింహాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

323
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles