గాలి దూమారంతో కుప్పకూలిన ఇళ్లు..

Mon,May 27, 2019 02:37 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ, మే 26 : రోహిణి కార్తె ఎండలతో అల్లాడుతున్న ప్రజలను అకాల వర్షం మరింత కృంగదీసింది. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిని వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంలో వడగండ్లు సైతం పడ్డాయి. అకాల వర్షానికి మండలంలోని నారాయణపురం, గుమ్మడవల్లి, కొత్తూరు, నందిపాడు గ్రామాల్లో పలు ఇళ్లు ధ్వంసం కాగా మామిడి తోటల్లో చెట్లు కూడా కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నారాయణపురంలో కూతాటి నారాయణ, బీ శ్రీనివాసరావు, పడాల వెంకటేశ్వరరావు, దేవరశెట్టి సత్యవతిలతో పాటు సుమారు 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో ఏడు ఇళ్లు పూర్తిగా, మరో 28 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంటి పైకప్పులు కూలిపోవటంతో ఇంట్లో సామగ్రి చెల్లాచెదురయ్యాయి. చిన్నంశెట్టి వెంకట నరసింహం పుగాకు బ్యారన్లపై రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. వర్షంతో పాటు వడగండ్లు కూడా పడటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇటీవల నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల కూలిపోయాయి. మామిడి కాయలు రాలిపోవటమే కాకుండా పలు గ్రామాల్లోని తోటల్లో చెట్లు కూడా నేలకూలాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ వీ రాఘవరెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటించారు. జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నష్టం అంచనాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని హమీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి మంజూరైయ్యే సాయంను తప్పక అందజేస్తామని భరోసా ఇచ్చారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles