పరస్పర సహకారంతోనే అభివృద్ధి

Mon,May 27, 2019 02:37 AM

దమ్మపేట, మే 26 : పరస్పర సహకారంతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు అన్నారు. ఆదివారం మండలంలోని గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి తన గెలుపునకు కృషి చేసిన తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా తన నివాసానికి వచ్చిన నామా నాగేశ్వరావును సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అక్కడకు వచ్చిన నాయకులను అభిమానులను పలకరించి కరచాలనంతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎంపీ నామా నాగేశ్వరావు ఏకాంతంగా కూర్చుని భవిష్యత్తు ప్రణాళికపై సమాలోచనలు చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. వీరి వెంట డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, తుళ్ళూరి బ్రహ్మయ్య, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్, జడ్పీటీసీ అభ్యర్థి పైడి వెంకటేశ్వరావు, దొడ్డాకుల రాజేశ్వరావు, మందలపల్లి ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ(సూరి), స్థానిక నాయకులు కోటగిరి బుచ్చిబాబు, యువజన విభాగం నాయకులు కాసాని నాగప్రసాద్, కందిమళ్ళ నాగప్రసాద్, తుమ్మల శేషు, దొడ్డా ప్రసాద్, కందిమళ్ళ నాగప్రసాద్, యర్రా వసంతరావు, కూకలకుంట రమేష్ తదితరులు ఉన్నారు.

261
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles