మణుగూరు రైల్వేస్టేషన్‌లో సకల సౌకర్యాలు...

Mon,May 27, 2019 02:38 AM

మణుగూరురూరల్, మే 26 : మణుగూరు రైల్వే స్టేషన్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మణుగూరు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్లు. కూర్చునేందుకు బల్లాలు లేక, తాగునీటి సౌకర్యం లేక ఎన్నో ఇక్కట్లు పడే వారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వేశాఖ ఇకపై ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దనే సదుద్దేశంతో అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఒకప్పుడు రైలేవస్టేషన్‌లో వేచి ఉండాలి అంటే ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందులు పడే వారు. కానీ ఇప్పుడు ఎంతసేపు అయినా వేచి ఉండేందుకు ప్రయాణికులు ఇష్టపడుతున్నారు. దీనికి కారణం రైల్వేశాఖ అధికారులు కల్పించిన సౌకర్యాలు. ప్రయాణికులు కూర్చునేందుకు ప్రత్యేక బల్లాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సాధారణ నీటితో పాటు చల్లటి తాగునీరు అందించేందుకు ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను గమణించిన రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేంగా దివ్యాంగుల కోసం మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వీటిని త్వరలోనే ప్రారంభించనున్నారు.

302
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles