హరితహారానికి మొక్కలు సిద్ధం

Mon,May 27, 2019 02:38 AM

అన్నపురెడ్డిపల్లి, మే 26: హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధమయ్యాయి. అటవీశాఖ ఆధ్వర్యంలోని అన్నపురెడ్డిపల్లి, అబ్బుగూడెం నర్సరీల్లో వివిధ రకాలైన సుమారు మూడులక్షల మొక్కలు పెరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో మండలంలోని పది పంచాయతీలలో పది నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఒక నర్సరీలో 20వేల చొప్పున మొత్తం పదింటిలో రెండు లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిలో ప్రధానంగా జామ, నిమ్మ, దానిమ్మ, చేదు వేప, నేరేడు, జువ్వి, మర్రి, జిట్రేగు, ఏగిస, తెల్లమద్ది, సింధుగ, ఇప్ప, నార వేప, ఉసిరి, మునగ, గానుగ, టేకు, పూల మొక్కలు ఉన్నాయి. ఈ నర్సరీలను ఉపాధి, అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రతతో మొక్కలు దెబ్బతినకుండా గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. మండలంలో గత నాలుగు విడతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమ విజయవంతానికి అధికారులు సన్నద్ధ్దమవుతున్నారు.

230
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles