త్వరలో తహసీల్దార్ల బదిలీలు

Mon,May 27, 2019 02:39 AM

-నేటితో ముగిసిన ఎన్నికల కోడ్
-జిల్లాలో బదిలీ కానున్న 20 మంది తహశీలార్లు
-ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దారులు తిరిగి ఖమ్మానికి వచ్చే అవకాశం

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభను రద్దుచేశారు. ఆ తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్‌లో తహసీల్దార్లను బదిలీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ, గ్రామపంచా యతీ, పార్లమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సోమవారంతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అయితే జిల్లా, మండల పరిషత్ ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వాయిదా వేయడం జరిగింది. తదుపరి ఏ తేదీన లెక్కింపు జరిగేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఎన్నికల కోడ్ జిల్లా, మండల పరిషత్ ఓట్ల లెక్కింపు వరకు కొనసాగుతుందని కొద్ది మంది ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఈ నెల 27 వరకు మాత్రమే ఎన్నికల కోడ్ అమలు లోఉంటుందని, లెక్కింపునకు కోడ్ ఉండదని ఓట్ల వరకు మాత్రమే కోడ్ అమలులో ఉంటుందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఎన్నికల కోడ్ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఓట్ల లెక్కింపు వరకు కోడ్ అమలులో ఉంటే తహసీల్దార్ల బదిలీలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా జూన్ మొదటివారంలో తహసీల్దారుల బదిలీలు ఉండవచ్చు అనేది రెవెన్యూ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రంలో 366మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ( చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 20 మంది తహసీల్దార్లను భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు బదిలో చేశారు. ఖమ్మం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్ రూరల్ జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేశారు. కాగా అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కనుక గతంలో వారు పనిచేసిన జిల్లాలకే తిరిగి వారిని బదిలీ చేయనున్నారు.

-జిల్లాకు రానున్న తహసీల్దార్లు ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న ఎం.మంగీలాల్, ఎం. రమాదేవి, ఎండీ ముజాహిద్, ఆర్. రాధిక, కె. రవికుమార్, టీ. శ్రీనివాసరావు, ఎన్. అరుణ, ఎన్. తిరుపతి ప్రకాష్, డి. నాగుబాయి, జీ. శిరీష, కేవీఎంఎ మీనన్‌లు, జపగాం జిల్లాలో పని చేస్తున్న కే. శ్రీనివాసరావు, దొడ్డి పుల్లయ్య, జీ. శ్రీలత, డి. తిరుమలాచారి, సీ. సత్యనారాయణలు, మహబూబాబాద్ జిల్లాలో పని చేస్తున్న డీ. సైదులు, జీ. నరసింహారావు, జీ. కృష్ణ, టీ. శ్రీనివాస్‌లు ఖమ్మం జిల్లాకు రానున్నారు.

- సొంత జిల్లాలకు వెళ్లనున్న తహసీల్దార్లు...
ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న పీవీ. రామకృష్ణ, కేవీ.శ్రీనివాసరావు, ఎం. ఉషా శారద, సీహెచ్ స్వామి, జె. స్వర్ణ, వై. శ్రీనివాసులు, ఎస్. అశోక్ చక్రవర్తి, ఎస్వీ. నారాయణమూర్తి, ఎం.భద్రకాళిలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు, ఎండీ. రియాజ్ అలీని కోమరంభీం జిల్లాకు, పీ. అనురాధబాయి, ఎ. రమేష్, కె. యోగేశ్వరరావు, జె. సంజీవ, కె. విజయ్‌కుమార్‌లను మహబూబాబాద్ జిల్లాకు, ఆర్. శేఖర్‌ను మంచిర్యాల జిల్లాకు, డీ.ఎస్. వెంకన్న , బీ. సరిత, ఎల్.పూ ల్‌సింగ్, వసన్ రామూర్తిలు వరంగల్ రూరల్ జిల్లాకు బదిలీచేయనున్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles