డాక్టర్ పోస్టుల భర్తీకి కలెక్టర్ అనుమతి

Tue,June 11, 2019 01:58 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అనుమతి ఇచ్చినట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 డాక్టర్ పోస్టులతో పాటు రెండు అంబులెన్సులను కూడా అనుమతించారని చెప్పారు. 4 స్పెషలిస్టు డాక్టర్లు, 10 జనరల్ డ్యూటీ డాక్టర్లు, కొత్తగూడెంతో పాటు భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులను నియమించేందుకు అనుమతించారని, త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు.

221
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles