పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Tue,June 11, 2019 01:58 AM

కొత్తగూడెం ఎడుకేషన్: పదవతరగతి సప్లమెంటరీ పరీక్షలు సోమవారంతో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రారంబమైన ఈ పరీక్షలకు 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 319 మందికి గాను 174 మంది విద్యార్థులు హాజరుకాగా 145 మంది గైర్హాజరయ్యారు. హాజరుశాతం 54.54 శాతంగా నమోదైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చే ముందు వారిని పరిశీలించి లోనికి అనుమతించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మాస్‌కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటివి జరగకుండా చర్యలు చేపట్టారు. దగ్గరలోని జిరాక్సు సెంటర్లను మూయించారు. విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించారు. ప్రతీ సెంటర్‌లో ఏఎన్‌ఎంలను ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించి ఎటువంటి లోపాలకు తావివ్వకుండా సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి.

189
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles