కేటీఆర్‌ను కలిసిన ప్రముఖులు

Tue,June 11, 2019 01:58 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన లింగాల కమల్‌రాజ్ సోమవారం హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నూకల నరేశ్‌రెడ్డి, తాతా మధు, వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles