నేటినుంచి ఖాతాల్లోకి..

Tue,June 11, 2019 02:00 AM

-ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.5 వేల చొప్పున పంపిణీ
-రైతుబంధు పథకం నగదు బదిలీకి రంగం సిద్ధం
-2,74 లక్షల మంది రైతులకు రూ 335.84 కోట్లు
-పోడుభూముల రైతులకు మరో రూ.7.5 కోట్లు
ఖమ్మం వ్యవసాయం:రైతుబంధు పథకం కింద ఈ వానాకాలం సీజన్‌కు పంట పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి సంబంధిత రైతుల ఖాతాల్లో పంటల పెట్టుబడి సాయం సొమ్ము జమకానుంది. ఇప్పటికే దాదాపు 70 వేల మంది రైతులకు సంబంధించిన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తయింది. నిరుడు ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా రెండు సీజన్‌లకు కలిపి 5,33,173 మంది రైతులకు రూ 510.02 కోట్లను అందించారు. నిరుడు ఎకరానికి రూ.4 వేలు చొప్పున రెండు సీజన్‌లకూ కలిపి రూ.8 వేలు అందించిన విషయం విదితమే. ఈ సంవత్సరం ఈ ఎకరానికి రెండు సీజన్‌లకూ కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీజన్‌కు ఆరంభంలో పంటల పెట్టుబడిని ప్రభుత్వమే భరించడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు అన్నదాతలు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా గతంలో సొంతభూమిని కౌలుకు ఇచ్చిన చాలామంది రైతులు నిరుడు సొంతంగా సాగు చేసుకున్న ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా రైతుబంధు సాయాన్ని విడతల వారీగా రైతుల ఖాతాలకు బదిలి చేయనున్నారు. ఈ సంవత్సరం ప్రస్తుత గణంకాల ప్రకారం 2,74,806 మంది రైతులకు రూ.355.84 కోట్లు అందించనున్నారు. వీటితో పాటు పోడుభూములు కలిగిన గిరిజన రైతులకు మరో రూ.7.5 కోట్లు కూడా పంపిణీ జరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వానాకాలం సీజన్‌కు రూ.343 కోట్లు
2019 వానాకాలం సీజన్‌కు రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.343 కోట్లను అన్నదాతలకు అందించనుంది. రెవెన్యూ అధికారుల గణంకాల ప్రకారం జిల్లా వ్యవసాయశాఖకు ఇందుకు సంబంధించి నివేదిక అందింది. ఈ సీజన్‌లో 2,74,806 మంది పట్టాదారు పాస్‌బుక్ కలిగిన రైతులకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున 335.84 కోట్లు అందున్నాయి. వీరితోపాటు పోడుభూములు కలిగిన గిరిజన రైతులకు గాను మరో రూ7.5 కోట్లు జమచేనున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సకాలంలో రైతుల ఖాతాలలో నగదు జమచేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల మంది రైతులకు సంబంధించిన ఖాతాల పూర్తి వివరాలను సేకరించిన అధికారులు ఇప్పటికే ఆమోదం కోసం అన్‌లైన్‌లో నమోదు చేశారు. మంగళవారం నుంచి మొదలుకొని ఈ నెల చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ పంట సాయం అందనుంది.

ఈ నెల చివరిలోపు ప్రక్రియ పూర్తి
రైతుబంధు పథకానికి సంబంధించి పంటల పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ సీజన్‌లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో చేస్తాం. అకౌంట్లలో మార్పులు జరిగితే సమీప విస్తరణ అధికారికి రైతులు తెలియజేయాలి. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 2.74 లక్షల మంది రైతులకు గాను రూ 335.84 కోట్లు అందిస్తాం. వీరితోపాటు పోడుభూములు కలిగిన రైతులకు సైతం పంటల పెట్టుబడి అందించే విధంగా కార్యాచరణ రూపొందించాం. సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రైతులు పంటల పెట్టుబడి సొమ్మును సద్వినియోగం చేసుకొవాలని సూచిస్తున్నాం.
-ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మండలాల వారీగా కేటాయింపులు ఇలా..
మండలం గ్రామాలు రైతులు పెట్టుబడి (రూపాయల్లో)
కామేపల్లి 13 8321 రూ.11,82,23,773
ఖమ్మం అర్బన్ 09 3259 రూ.40,27,080
రఘునాథపాలెం 12 13,594 రూ.17,17,62,958
ఖమ్మం రూరల్ 19 13,723 రూ.16,90,48,528
కూసుమంచి 18 15,826 రూ.19,68,39,574
నేలకొండపల్లి 23 16,804 రూ.17,41,57,535
తిరుమలాయపాలెం 25 17,153 రూ.21,30,40,439
బోనకల్లు 18 14,641 రూ.15,46,55,149
చింతకాని 16 15,449 రూ.18, 65,99,063
మధిర 25 16,759 రూ.19,60,50,136
ముదిగొండ 23 15,618 రూ.19,29,49,810
ఎర్రుపాలెం 24 13,779 రూ.17,54,57,549
కల్లూరు 23 18,491 రూ.20,90,06,868
పెనుబల్లి 21 10,822 రూ.17,46,86,067
సత్తుపల్లి 15 11,439 రూ.15,14,24,311
తల్లాడ 19 13,884 రూ.16,75,19,812
వేంసూరు 14 15,878 రూ.19,72,23,169
ఏన్కూరు 11 7,202 రూ.10,63,35,042
కొణిజర్ల 18 12,983 రూ.15,49,78,828
సింగరేణి 11 7,343 రూ.10,05,28,856
వైరా 22 11,869 రూ.12,75,70,540
మొత్తం 379 2,74,806 రూ.335,84,35,086

348
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles