నూతన పరిషత్ అధ్యక్షులకు ఎంపీపీ సన్మానం

Wed,June 12, 2019 12:07 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జూన్ 11 : ఇటీవల వెలువడిన పరిషత్ ఫలితాల అనంతరం కొత్తగా ఎన్నుకోబడిన ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కిష్టారం గ్రామ ఎంపీటీసీ పాలకుర్తి సునీత లను ప్రస్తుత ఎంపీపీ జ్యేష్ట అప్పారావు ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుండాలని అన్నారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన పదవికి వన్నె తెస్తు పాలనపై పట్టు సాధించాలన్నారు. తద్వారా గ్రామ స్దాయిలో పార్టీ బలొపేతం కూడా సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు దొడ్డా శంకర్‌రావు, చల్లగుండ్ల నరసింహారావు, నరుకుళ్ళ అప్పారావు, రవి, నరేంద్ర, నరసింహారావు, మామిళ్ళపల్లివెంకటేశ్వరరావు, చిలుకూరి మోహన్‌రెడ్డి, మధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

218
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles