విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

Wed,June 12, 2019 12:07 AM

భద్రాచలం, నమస్తేతెలంగాణ : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల గదులను ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎస్వో విభాగానికి చేరుకొని విధి నిర్వహణ విషయాలను ఎస్వో సురేష్‌బాబును అడిగి తెలసుకున్నారు. అనంతరం గణాంక విభాగాన్ని పరిశీలించి సిబ్బంది జీతభత్యాలు, పాత అకౌంట్ రికార్డులు గురించి గణాంక అధికారి భీంను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆర్వోఎఫ్‌ఆర్ విభాగం, వ్యవసాయ శాఖ, విద్యుత్ విభాగాలతో పాటు, ఆపీసు మేనేజర్ పరిపాలనా విభాగాలను పరిశీలించారు. అన్ని విభాగాలోని సిబ్బంది కార్యాలయాల పనిధినాల్లో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏపీవో జనరల్ నాగోరావును ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు తమ శాఖల ద్వారా రోజువారీ కార్యకలాపాల రిజిస్టర్లు, అధికారుల, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదును పరిశీలించాలని కోరారు. ఐటీడీఏలోని మూత్రశాలలను పీవో పరిశీలించారు. మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ రావడం లేదని, టాయ్‌లెట్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యం వహిస్తున్నారని అపరిశుభ్రంగా ఉండటానికి కారణం ఏమిటని క్లీనింగ్ సిబ్బంది విధి నిర్లక్ష్యంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏకు వచ్చే గిరజనులకు ఆర్వో ప్లాంట్ మంచి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. వీటన్నింటిపై మేనేజర్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇకనుంచి ఐటీడీఏలోని వివిధ శాఖల విభాగాలను ఆకస్మిక పర్యటనల ద్వారా సిబ్బంది కార్యకలాపాలను పరిశీలిస్తారన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో అపరిచిత వ్యక్తులు రాత్రి, పగలు తేడా లేకుండా కార్యాలయంలోకి ప్రవేశిస్తూ యూనిట్ అధికారుల క్వార్టర్స్‌లో ఉండే వారికి ఇబ్బంది కల్గిస్తున్నారన్నారు. కార్యాలయం ముందు భాగంలో సెక్యూరిటీ విభాగం కోసం రూమ్ నిర్మిస్తారని, అక్కడ డ్యూటీ చేసే సిబ్బంది విధి నిర్వహణలో సరిగ్గా ఉండలేక పోవడం వల్ల ఇదంతా జరుగుతోందని దీనిని తీవ్రంగా పరిగణించి డ్యూటీ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీవోతో పాటు ఏపీవో జనరల్ నాగోరావు, ఎవో భీం, ఎస్వో సురేష్ బాబు, ఏపీవో పవర్ అనురాధ, ఐటీడీఏ మేనేజర్ సురేందర్, ఆర్వోఎఫ్‌ఆర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles